Home గాసిప్స్ ఆ సినిమా కాన్సిల్ కానీ…స్కంద కాన్సిల్ అవ్వలేదంట!

ఆ సినిమా కాన్సిల్ కానీ…స్కంద కాన్సిల్ అవ్వలేదంట!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా భారీ వీకెండ్ లో 2 స్ట్రైట్ తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ రెండు సినిమాలు కూడా పార్ట్ 1 లు కాగా రెండు సినిమాలకు మిక్సుడ్ రెస్పాన్స్ వచ్చింది, కానీ ఒక సినిమా మినిమం షేర్ ని కూడా వసూల్ చేయలేక బాక్స్ ఆఫీస్ దగ్గర…

అట్టర్ డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. కానీ మరో సినిమా టార్గెట్ ఎక్కువ అవ్వడంతో నిరాశ పరిచినా మిక్సుడ్ టాక్ తో కూడా చాలా దూరమే కలెక్షన్స్ ని సాధించింది. ఆ సినిమాలే ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) నటించిన స్కంద(Skanda Movie) కాగా…

మరోటి శ్రీకాంత్ అడ్డాల(Srikanth Addala) డైరెక్షన్ లో వచ్చిన పెద్దకాపు1(Peddha Kapu1) సినిమాలు…రెండు సినిమాలకు మిక్సుడ్ టాక్ వచ్చిన రామ్ బోయ ల కాంబో అవ్వడంతో మాస్ సెంటర్స్ లో స్కంద మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది.

కానీ పెద్దకాపు1 కొత్త వాళ్ళతో తెరకెక్కడంతో ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపించలేక పోయింది. ఓవరాల్ గా ఈ రెండు సినిమాల రిజల్ట్ లు సీక్వెల్స్ పై ఇంపాక్ట్ చూపెట్టడం ఖాయం కాగా పెద్దకాపు1 కి సీక్వెల్ ఇక ఉండే అవకాశం లేదని ఇండస్ట్రీలో స్ట్రాంగ్ బజ్ ఉండగా…

స్కంద సినిమా సీక్వెల్ విషయంలో కూడా ఇదే జరుగుతుందని వార్తలు వస్తున్నా రామ్ బోయలు సినిమాకి మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా వస్తున్న వసూళ్లు చూసి సీక్వెల్ పకడ్బందీగా చేయాలని అనుకుంటున్నారట. ఇప్పటికిప్పుడు కాక పోయినా బోయపాటి రామ్ ల ప్రజంట్ కమిట్ మెంట్స్ తర్వాత ఈ సీక్వెల్ ఉంటుందని అంటున్నారు… 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here