Home న్యూస్ సంక్రాంతి మూవీస్(15-01-2024) బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!

సంక్రాంతి మూవీస్(15-01-2024) బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ అఫీస్ దగ్గర సంక్రాంతికి రిలీజ్ అయిన అన్ని సినిమాలు కూడా ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తూ దుమ్ము లేపుతూ ఉండగా ఉన్నంతలో అన్ని సినిమాల్లో కూడా హనుమాన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పండగ రోజుల్లో అన్ని సినిమాలను డామినేట్ చేస్తూ ఉందని చెప్పాలి…

|హనుమాన్|Hanuman Day 4 Box Office Collections
మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు సినిమాకి షోలు కూడా పెరిగాయి, పెరిగిన షోలు అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. మొత్తం మీద ఎక్స్ ట్రా షోల కోసం ఇంకా ట్రై చేస్తూ ఉండగా ఈవినింగ్ షోలు కూడా ఎక్స్ లెంట్ గా ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో 6-6.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే ఈ కలెక్షన్స్ ఇంకా పెరగవచ్చు, ఇక వరల్డ్ వైడ్ గా 10-11 కోట్ల రేంజ్ లో షేర్ ని సినిమా అందుకునే అవకాశం ఉందని చెప్పాలి….

|గుంటూరు కారం|- Guntur Kaaram Day 4 Box Office Collections
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) గుంటూరు కారం సినిమా నాలుగో రోజు నైజాంలో మరోసారి డ్రాప్స్ సొంతం చేసుకోగా ఆంధ్రలో మంచి జోరుని చూపించింది, మ్యాట్నీ షోల నుండి సినిమా జోరు చూపిస్తూ ఉండగా నైట్ షోలకు కూడా బుకింగ్స్ ట్రెండ్ సాలిడ్ గా ఉండగా సినిమా 4వ రోజు మొత్తం మీద అటూ ఇటూగా 8-9 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది, ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది…

|సైంధవ్| Saindhav 3rd Day Box Office Collections
బాక్స్ ఆఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్(Venkatesh) సైంధవ్ మూవీ మూడో రోజులో ఉన్నంతలో కొద్ది వరకు గ్రోత్ ని చూపించింది, థియేటర్స్ సంఖ్య తగ్గగా ఉన్నంతలో ఉన్న థియేటర్స్ లో ఆంధ్రలో డీసెంట్ గా ట్రెండ్ అవుతూ ఉండగా నైజాంలో మాత్రం డ్రాప్ అయింది, ఈ రోజు సినిమా 1.6-1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఫైనల్ లెక్కలు బాగుంటే 2 కోట్ల దాకా వెళ్ళొచ్చు…

|నా సామి రంగ| – Naa saami Ranga 2nd Day Box Office Collections
బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్ నాగార్జున(Nagarjuna) నా సామి రంగ సినిమా అన్ని చోట్లా సాలిడ్ కలెక్షన్స్ తో జోరు చూపిస్తూ రెండో రోజు సంక్రాంతి హాలిడేని ఎంజాయ్ చేస్తుంది, సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు మరోసారి 4-5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే అంచనాలను మించిపోవచ్చు. సినిమా త్వరలోనే బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది.

ఉన్నంతలో అన్ని సినిమాల్లో సైంధవ్ మూవీ ఆడియన్స్ కి లీస్ట్ ప్రియారిటీని సొంతం చేసుకుందని చెప్పాలి ఇప్పుడు. మొత్తం మీద ఈ రోజు ఉన్నంతలో ఏ సినిమా రేంజ్ లో ఆ సినిమా మంచి జోరునే చూపిస్తూ ఉండగా అన్ని సినిమాల అఫీషియల్ కలెక్షన్స్ లెక్క ఇదే రేంజ్ లో ఉంటుందా లేక కొంచం అటూ ఇటూగా ఉంటాయో చూడాలి ఇక… 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here