ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు టాలీవుడ్ నుండి రామ్ చరణ్(Ram Charan) నటించిన గేమ్ చేంజర్(Game Changer) మూవీ బాలకృష్ణ(Balakrishna) నటిస్తున్న డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) సినిమాలు మేజర్ గా పోటి పడబోతూ ఉండగా వెంకటేష్(Venkatesh) నటించిన సంక్రాంతికివస్తున్నాం(Sankranthiki Vasthunam Movie)సినిమాలు…
మేజర్ గా రిలీజ్ అవుతూ ఉండగా గేమ్ చేంజర్ మరియు డాకు మహారాజ్ ల సినిమాలతో పోల్చితే సంక్రాంతికి వస్తున్నాం సినిమా సీనియర్ మూవీ అయినా కూడా బిజినెస్ పరంగా చూసుకుంటే మూడు సినిమాల్లో చిన్న సినిమానే అని చెప్పాలి. కానీ ఇప్పుడు రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ…
అసలు ట్రైలర్ లాంటివి ఏవి రిలీజ్ కానుండగానే ఈ సినిమాకి సాలిడ్ బజ్ అయితే మార్కెట్ లో ఉందని చెప్పాలి ఇప్పుడు…దానికి ప్రదాన కారణం సినిమా ప్రమోషన్స్ అండ్ ఆడియో సూపర్ డూపర్ హిట్ అవ్వడం….సంక్రాంతికి వస్తున్న గేమ్ చేంజర్ సినిమా నుండి…
వచ్చిన పాటలు విజువల్ గా ఎక్స్ లెంట్ గా ఉంటాయి అని చెబుతున్నా ఆడియో పరంగా అనుకున్న రేంజ్ రీచ్ అయితే సొంతం అవ్వలేదు, మొదటి రోజు రికార్డ్ వ్యూస్ రావడం, తర్వాత రోజుల్లో చాలా స్లోగా వ్యూస్ వస్తూ ఉండటంతో ప్రస్తుతానికి లాంగ్ రన్ ఆడియోకి తక్కువగా కనిపిస్తూ ఉండగా…
మరో పక్క బాలయ్య డాకు మహారాజ్ నుండి వచ్చిన మూడు పాటలు మిగిలిన సినిమాలతో పోల్చితే వీకేస్ట్ అనిపించేలానే ఉన్నాయి…కానీ అదే టైంలో సంక్రాంతికి వస్తున్నాం నుండి వచ్చిన మూడు పాటలు కూడా మొదటి రోజు వ్యూస్ తక్కువగానే ఉన్నప్పటికీ కూడా…
లాంగ్ రన్ లో స్టడీగా వ్యూస్ పెరుగుతూ మిగిలిన సినిమాల పాటలతో పోల్చితే సాలిడ్ రీచ్ ను సొంతం చేసుకుని ఓవరాల్ గా సంక్రాంతి సీజన్ లో మంచి బజ్ ను సొంతం చేసుకున్న మూవీ గా నిలిచింది. ఇక సరైన ట్రైలర్ రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి మినిమమ్ టాక్ బాగున్నా…
ఫ్యామిలీ ఆడియన్స్ లో విక్టరీ వెంకటేష్ కి ఉండే ఫాలోయింగ్ హెల్ప్ అండ్ సంక్రాంతికి పెర్ఫెక్ట్ మూవీ అని అంటూ ఉండటం కలిసి వచ్చి కచ్చితంగా ఎఫ్2 మూవీ రేంజ్ లో రచ్చ చేయడానికి అవకాశం ఎంతైనా ఉంటుంది. మరి ఈ సంక్రాంతికి ఎలాంటి సర్ ప్రైజ్ లు జరుగుతాయో చూడాలి.