బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు ఆడియన్స్ సినిమా నచ్చితే చాలు అందులో హీరో ఎవరు అన్నది పెద్దగా పట్టించుకోరు అని అనేక సార్లు రుజువు అవ్వగా ఇప్పుడు లేటెస్ట్ తెలుగు డబ్ మూవీస్ తో తెలుగు వాళ్ళకి పరిచయమే అయినా రఘువరన్ బి.టెక్ రేంజ్ హిట్ ని తెలుగు లో మళ్ళీ సొంతం చేసుకోలేక పోయిన ధనుష్ ఇప్పుడు తెలుగు తమిళ్ బైలింగువల్ గా తెరకెక్కించిన సార్ మూవీతో ఇక్కడ సెన్సేషనల్ హిట్ ని….
సొంతం చేసుకుని దుమ్ము లేపగా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజుల్లో తెలుగు వర్షన్ మూవీ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా 20 కోట్ల గ్రాస్ మార్క్ ని అధిగమించడం విశేషం అని చెప్పాలి. సినిమా 3 రోజుల్లోనే మొత్తం మీద వరల్డ్ వైడ్ గా….
18.20 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోగా సినిమా 4వ రోజు సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు ఆల్ మోస్ట్ 20 కోట్ల గ్రాస్ మార్క్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని సంచలనం సృష్టించింది ఇప్పుడు. తెలుగులో ధనుష్ కి ఇది ఆల్ టైం ఎపిక్ బెంచ్ మార్క్ కలెక్షన్స్ అని చెప్పాలి.
సినిమా వర్కింగ్ డేస్ లో కూడా మంచి హోల్డ్ ని చూపిస్తూ ఉండటం, వచ్చే రెండు మూడు వారాలు పెద్దగా పోటి ఏమి లేక పోవడం చూస్తుంటే సినిమా లాంగ్ రన్ లో మరిన్ని అద్బుతాలు సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మరి సినిమా ఫైనల్ గా ఏ రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.