బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వారాన్ని పూర్తి చేసుకోవడానికి సిద్ధం అవుతున్న కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా కి 20వ రోజు రంజాన్ హాలిడే అడ్వాంటేజ్ లభించడంతో మంచి హోల్డ్ తో అన్ని చోట్లా జోరు చూపిస్తుంది. తెలుగు రాష్ట్రాలలో 30% రేంజ్ లో గ్రోత్ ఉండగా ఈ రోజు సినిమా 50-60 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక కర్ణాటకలో ఈ రోజు 2.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని….
అందుకునే అవకాశం కనిపిస్తుండగా సినిమా తమిళనాడు అండ్ కేరళలో ఈ రోజు మొత్తం మీద 3 కోట్ల దాకా గ్రాస్ ని అందుకునే ఛాన్స్ ఉంది. ఇక హిందీ లో సినిమా ఈ రోజు 6 కోట్ల దాకా నెట్ కలెక్షన్స్ ని అందుకునే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు…
మొత్తం మీద ఈ రోజు సినిమా ఇండియా లో 13.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ కలెక్షన్స్ తో సినిమా 15 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ ను అందుకోవచ్చు. మొత్తం మీద టోటల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే ఈ లెక్క మరింత ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉండగా 20వ రోజు మాస్ రచ్చ చేసిన ఈ సినిమా అఫీషియల్ 20 డేస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.