బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా కెరీర్ బెస్ట్ రికార్డులను నమోదు చేసి ఇప్పుడు మూడు వారాలను పూర్తి చేసుకోవడానికి సిద్దం అవుతూ ఉండగా, వర్కింగ్ డేస్ వలన సినిమా…కొంచం స్లో డౌన్ అయినా….
కూడా మేజర్ సెంటర్స్ లో సినిమా డీసెంట్ షేర్స్ ని సాధిస్తూ ఉండగా 20వ రోజున శివరాత్రి హాలిడే అడ్వాంటేజ్ తో పర్వాలేదు అనిపించేలా గ్రోత్ ని సినిమా చూపించగా ఉన్నంతలో సినిమా డీసెంట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంది అన్ సీజన్ లో కూడా…
ఓవరాల్ గా సినిమా 20వ రోజుతో పోల్చితే 21వ రోజున ఫుల్ వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన డ్రాప్స్ ఉండగా మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తుంటే సినిమా 15-16 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా…
ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ కొంచం పెరిగే అవకాశం ఉంది, ఇక సినిమా తెలుగు రాష్ట్రాల ఆవల పెద్దగా షేర్ వచ్చే అవకాశం లేకపోవడంతో ఇదే రేంజ్ లో షేర్ ని సినిమా సొంతం చేసుకునే అవకాశం ఉండగా, వరల్డ్ వైడ్ గా సినిమా…
బాక్స్ ఆఫీస్ దగ్గర 30-32 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి… ఓవరాల్ గా సినిమా ఇప్పటికీ డీసెంట్ హోల్డ్ తో పరుగును కొనసాగిస్తుంది. ఇక తండేల్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 3 వారాల్లో సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.