బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైంలో రిలీజ్ అయిన బిగ్ బడ్జెట్-పాన్ ఇండియా మూవీస్ అన్నీ కూడా ఎదో ఒక పండగ వీకెండ్ అడ్వాంటేజ్ తోనే రిలీజ్ అయ్యాయి. కానీ రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD(Kalki 2898 AD Movie) ఎలాంటి పండగ అడ్వాంటేజ్ లేకుండా…
జస్ట్ నార్మల్ వీకెండ్ లో రిలీజ్ అవ్వగా రిలీజ్ అయిన రోజు నుండి ఆల్ మోస్ట్ ఇప్పుడు 3 వారాలు కావోస్తూ ఉండగా ఒక్క పండగ అడ్వాంటేజ్ కూడా లభించని సినిమాకి ఎట్టకేలకు రిలీజ్ అయిన 21వ రోజున మొహర్రం మరియు తొలి ఏకాదశి లాంటి పార్షిక హాలిడే అడ్వాంటేజ్ లభించింది…
ఈ అడ్వాంటేజ్ ను సూపర్బ్ గా వాడుకుంటున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో అలాగే హిందీలో ఎక్స్ లెంట్ గా ట్రెండ్ ను చూపిస్తూ దూసుకు పోతుంది…తెలుగు రాష్ట్రాల్లో సినిమా 20వ రోజు కన్నా కూడా బెటర్ గా ట్రెండ్ అవుతూ ఉండగా కొన్ని థియేటర్స్ లో 60-70% రేంజ్ లో ఆక్యుపెన్సీ రిపోర్ట్ అవ్వగా…
కొన్ని చోట్ల సినిమాకి హౌస్ ఫుల్ బోర్డులు కూడా పడ్డాయి ఇప్పుడు….రిలీజ్ అయిన 21వ రోజున ఇలా హౌస్ ఫుల్ బోర్డులు ఎక్స్ లెంట్ ఆక్యుపెన్సీని సొంతం చేసుకుంటూ దూసుకుపోవడం అన్నది మామూలు విషయం కాదనే చెప్పాలి ఇప్పుడు…
మొత్తం మీద ఇప్పుడు 21వ రోజున ట్రెండ్ ను చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో 1.2 కోట్లకు పైగానే షేర్ రిపోర్ట్ అయ్యే అవకాశం ఉండగా నైట్ షోలకు ఇదే ట్రెండ్ కొనసాగితే షేర్ లెక్క ఇంకా పెరిగి 1.5 కోట్ల మార్క్ వైపు వెళ్ళే అవకాశం ఎంతైనా ఉంది…
ఇక హిందీలో కూడా మంచి గ్రోత్ ని చూపిస్తున్న సినిమా అక్కడ మరింత రచ్చ చేసే అవకాశం కనిపిస్తూ ఉండగా ఓవరాల్ గా 21వ రోజు ఊహకందని రేంజ్ లో జోరు చూపించే అవకాశం ఉంది. మొత్తం మీద డే ఎండ్ అయ్యే టైంకి సినిమా ఎలాంటి హోల్డ్ తో షేర్ ని అందుకుంటుందో చూడాలి ఇప్పుడు…