Home న్యూస్ సింహాద్రి సింహగర్జనకి 21 ఏళ్ళు…ఈ రికార్డ్ ఇప్పటికీ చెక్కు చెదరలేదు!

సింహాద్రి సింహగర్జనకి 21 ఏళ్ళు…ఈ రికార్డ్ ఇప్పటికీ చెక్కు చెదరలేదు!

0
21 Years For JR NTR Simhadr - 175 Days Centers - Business and Total Collections
21 Years For JR NTR Simhadr – 175 Days Centers – Business and Total Collections

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) ఎస్ ఎస్ రాజమౌళి(SS Rajamouli) ల కాంబినేషన్ లో వచ్చిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ సింహాద్రి (Simhadri) సినిమా అప్పట్లో ఏ రేంజ్ లో ఊచకోత కోసిందో అందరికీ తెలిసిందే… ఓ యంగ్ హీరో ఏకంగా అప్పటి టాప్ స్టార్స్ నటించిన…

సినిమాలకు ధీటుగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని ఊచకోత కోసే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని అందరినీ ఆశ్యర్యపరిచే రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సింహాద్రి సినిమా రిలీజ్ అయ్యి ఇప్పుడు 21 ఏళ్లని పూర్తీ చేసుకుంది…. 

ఆ టైంలో ఈ సినిమా నెలకొల్పిన రికార్డులు ఎన్నో కాగా అందులో ఇప్పటికీ ఈ సినిమా సాధించిన ఒక రికార్డ్ అలాగే కొనసాగుతుంది. బహుశా ఫ్యూచర్ లో కూడా ఈ సినిమా రికార్డ్ బ్రేక్ అయ్యే అవకాశమే లేదని చెప్పొచ్చు. ఆ రికార్డ్ మరేదో కాదు 175 రోజుల సెంటర్స్ రికార్డ్…

   

2003 టైంలో 12.50 కోట్ల రేంజ్ బిజినెస్ కి టోటల్ రన్ లో 26.50 కోట్లకు పైగా షేర్ ని అందుకుని ఏకంగా డబుల్ ప్రాఫిట్స్ తో ఎపిక్ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఏకంగా 175 రోజులను 52 డైరెక్ట్ సెంటర్స్ లో మరో 3 షిఫ్ట్ సెంటర్స్ లో జరుపుకుంది…

అంతకన్నా ముందు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన ఇంద్ర(Chiru Indra Movie) 175 రోజులను 31 డైరెక్ట్ సెంటర్స్ లో జరుపుకోగా ఆ రికార్డ్ ను బ్రేక్ చేసిన సింహాద్రి 52 డైరెక్ట్ సెంటర్స్ లో చరిత్ర సృష్టించింది. ఆ రికార్డ్ ను తర్వాత ఏ సినిమా అందుకోలేక పోయింది. ఇలాంటి ఎపిక్ రికార్డ్ ను సొంతం చేసుకున్న సింహాద్రి సినిమా రిలీజ్ అయ్యి 21 ఏళ్ళు పూర్తీ అవ్వడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here