మెగాస్టార్ చిరంజీవి 151 వ సినిమా సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వారాలను పూర్తీ చేసుకుంది, ఆల్ మోస్ట్ 141 కోట్ల లోపు షేర్ ని మూడు వారాల్లో అన్ని చోట్లా కలిపి సొంతం చేసుకున్న ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కి ఇప్పటికీ చాలా దూరం లోనే ఉండి పోగా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో బ్రేక్ ఈవెన్ కి దగ్గర గా ఉండటం తో ఆ మార్క్ ని అందుకుంటుందా…
లేదా అన్న ఆసక్తి అందరిలోనూ ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. సినిమా మూడు వారాలు ముగిసే సరికి సైరా నరసింహా రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 106 కోట్ల మార్క్ ని అధిగమించింది. బిజినెస్ ని దాటాలి అంటే మరో 80 లక్షల దాకా షేర్ ని అందుకోవాలి.
బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో కోటిన్నర దాకా షేర్ ని సాధించాలి… ఇలాంటి టార్గెట్ తో సినిమా నాలుగో వారం మొదలు పెట్టగా… నాలుగో వారం మొదటి రోజు కూడా వర్కింగ్ డే నే అవ్వడం తో సినిమా కి డ్రాప్స్ అన్ని చోట్లా గట్టిగానే ఉన్నాయని చెప్పొచ్చు. సినిమా ఓవరాల్ గా 21 వ రోజు తో పోల్చుకుంటే 22 వ రోజు…
బాక్స్ ఆఫీస్ దగ్గర 30% కి పైగా డ్రాప్స్ ని సొంతం చేసుకుంది, దాంతో సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 15 లక్షల లోపు షేర్ ని 22 వ రోజున సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా కూడా 17 లక్షల రేంజ్ షేర్ ని అందుకునే అవకాశం ఉంది.
రెండు రాష్ట్రాలలో బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఈ వీకెండ్ లో సినిమా మంచి ప్రదర్శన కనబరాల్చిన అవసరం ఎంతైనా ఉంది. బ్రేక్ ఈవెన్ అవ్వకున్నా బిజినెస్ ని అన్న దాటాలి అనుకుంటే సినిమా కచ్చితంగా హోల్డ్ చేయక తప్పదు. మరి ఈ వీకెండ్ లో సినిమా కలెక్షన్స్ ప్రదర్శన ఏ విధంగా ఉంటుందో చూడాలి.