Home గాసిప్స్ ఎన్టీఆర్-అట్లీ….పాన్ ఇండియా సెన్సేషన్!!

ఎన్టీఆర్-అట్లీ….పాన్ ఇండియా సెన్సేషన్!!

0

     యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి జోరు మీదున్న విషయం తెలిసిందే, కెరీర్ లో ఎప్పుడూ లేనిది వరుసగా 5 సినిమాలుగా ఒక్క అపజయం లేకుండా దూసుకు పోతున్న ఎన్టీఆర్ ఇప్పుడు రామ్ చరణ్ తో కలిసి రాజమౌళి డైరెక్షన్ లో ఆర్.ఆర్.ఆర్ సినిమా లో నటిస్తున్న విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కమిట్ మెంట్స్ గట్టిగానే ఉన్నాయని తెలుస్తుంది.

త్రివిక్రమ్ తో, కే.జి.ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో, కొరటాల శివ తో సినిమాలు వరుస పెట్టి ఉంటాయని తెలుస్తుండగా వీటితో పాటు మరో యంగ్ డైరెక్టర్ తో కూడా ఎన్టీఆర్ సినిమా కన్ఫాం అనే అంటున్నారు. కోలివుడ్ లో రాజా రాణి, తెరి, మెర్సల్ లాంటి హాట్రిక్ బ్లాక్ బస్టర్స్ ల డైరెక్టర్…

అట్లీ ఇప్పుడు విజయ్ తో మరోసారి చేసిన బిగిల్ తో దీపావళి కి రాబోతుండగా సినిమా తెలుగు వర్షన్ ప్రమోషన్ కోసం రీసెంట్ గా టాలీవుడ్ కి వచ్చిన అట్లీ తన ప్రతీ సినిమా రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ నుండి ఫోన్ వస్తుందని, ఎన్టీఆర్ ఎప్పుడూ వెన్నంటి నిలిచాడని మెచ్చుకున్నాడు.

దాంతో పాటే త్వరలోనే తనకి ఇష్టమైన హీరో తో ఇక్కడ డైరెక్ట్ సినిమా చేయబోతున్నా అని కన్ఫామ్ చేశాడు. ఎన్టీఆర్ అట్లీ తో అశ్వనీదత్ నిర్మాణం లో సినిమా ఎప్పుడో కమిట్ అయ్యారని టాక్ ఉంది. ఇప్పుడు అదే సినిమా కన్ఫాం కానుందని అంటుండగా… ప్రస్తుతం అట్లీ విజయ్ తో సినిమా ముగించగా… త్వరలోనే బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ తో సినిమా చేయనున్నాడు.

ఇక ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత త్రివిక్రమ్ తోనే చేసే చాన్స్ ఉంది. తర్వాత అట్లీ తో కానీ ప్రశాంత్ నీల్ తో కాని సినిమా కన్ఫాం అంటున్నారు. ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్ ప్రకారం అట్లీ తో చేసే సినిమా పాన్ ఇండియా మూవీ అని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుంది అన్నది తెలియాలి అంటే కొంత సమయం ఆగాల్సిందే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here