బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగో వీకెండ్ లో కూడా హౌస్ ఫుల్ బోర్డులతో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోయింది విక్రమ్ మూవీ. సినిమా 24వ రోజు ఆదివారం అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. తమిళనాడులో ఆల్ టైం ఎపిక్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న విక్రమ్ మూవీ 24వ రోజు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది.
ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా 24వ రోజు కొత్తగా రిలీజ్ అయిన మూవీస్ తో పోటీ పడుతూ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకుంది విక్రమ్ మూవీ. సినిమా 24వ రోజు తెలుగు రాష్ట్రాలలో 32 లక్షల షేర్ ని సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి.
ఇక సినిమా టోటల్ గా 24 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 6.91Cr
👉Ceeded: 2.19Cr
👉UA: 2.38Cr
👉East: 1.25Cr
👉West: 83L
👉Guntur: 1.14Cr
👉Krishna: 1.32Cr
👉Nellore: 58L
AP-TG Total:- 16.60CR(29.05CR~ Gross)
7.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 9.10 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 24 రోజులు పూర్తీ అయిన తర్వాత సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Tamilnadu – 169.80Cr
👉Telugu States- 29.05Cr
👉Karnataka- 19.50Cr
👉Kerala – 36.80Cr
👉ROI – 11.30Cr
👉Overseas – 119.20CR
Total WW collection – 385.65CR(191.50CR~ Share)
ఇదీ టోటల్ గా సినిమా 24 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్క…
24 వ రోజు ఏకంగా 7.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది ఈ సినిమా. మొత్తం మీద 100 కోట్ల బిజినెస్ మీద ఏకంగా 91 కోట్లకు పైగా లాభాన్ని సొంతం చేసుకుని ఆల్ మోస్ట్ డబల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడానికి సిద్ధం అవుతుంది ఈ సినిమా. ఎపిక్ కలెక్షన్స్ తో తమిళనాడులో కొత్త బెంచ్ మార్క్ ని అందుకున్న ఈ సినిమా లాంగ్ రన్ లో ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి.