Home న్యూస్ బ్లాక్ బస్టర్ తర్వాత డిసాస్టర్….కానీ ఇప్పుడు హిట్ పక్కాలా ఉంది!!

బ్లాక్ బస్టర్ తర్వాత డిసాస్టర్….కానీ ఇప్పుడు హిట్ పక్కాలా ఉంది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి సినిమా ఉప్పెనతో ఆల్ టైం రికార్డులను నమోదు చేసిన పంజా వైష్ణవ్ తేజ్ ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ ను తర్వాత సినిమా కొండపొలంతో కొద్ది వరకు కోల్పోవాల్సి వచ్చింది. బాక్స్ ఆఫీస్ దగ్గర కొండ పొలం తీవ్రంగా నిరాశ పరిచిన తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రంగ రంగ వైభవంగ సినిమాతో రావాడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అఫీషియల్ టీసర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు.

ఇక టీసర్ చూసిన తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కంబ్యాక్ ని వైష్ణవ్ తేజ్ సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని పించేలా మెప్పించింది అని చెప్పాలి… హీరో హీరోయిన్స్ ప్రేమించుకున్నా కానీ ఇద్దరూ ఈగో క్లాషేస్ వల్ల మాట్లాడుకోరు…

అలాంటి వీళ్ళ ప్రేమ ఎలా సఫలం అయ్యింది అన్నది మొత్తం మీద సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. క్వాలిటీ పరంగా కానీ, బ్యాగ్రౌండ్ స్కోర్ కానీ అద్బుతంగా ఉండటంతో టీసర్ ఇన్స్ స్టంట్ పాజిటివ్ ఫీల్ ని కలిగించింది అని చెప్పాలి. ఇక త్వరలోనే బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ కానున్న ఈ సినిమా ఇదే రేంజ్ లో మెప్పిస్తే కచ్చితంగా సాలిడ్ హిట్ ఖాయమని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here