బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే బాక్స్ ఆఫీస్ దగ్గర సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ ఏమి లేకుండా ఉండి ఉంటే మే 13 న సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఓపెన్ అయ్యేది… కానీ సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ పీక్స్ లో ఉండటం సినిమాను ఇక డిజిటల్ లోనే రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యారు. పే పెర్ వ్యూ పద్దతిలో సినిమాను జీ ప్లెక్స్ లో 249 టికెట్ రేటు తో…..
రిలీజ్ చేయబోతున్నామని ఫుల్ పబ్లిసిటీ చేశారు. ఇక ఇప్పటి వరకు పే పెర్ వ్యూ పద్దతిలో రిలీజ్ అయిన సినిమాలు తక్కువే కాబట్టి ట్రాఫిక్ ఎంతవరకు ఉంటుంది, అన్నది అంచనా లేక పోయినా ఇది వరకు ఈ పద్దతిలో రిలీజ్ అయిన సినిమాలకు…
పెద్దగా ఏమి ఇబ్బంది అయితే కలగలేదు అనే చెప్పాలి. కానీ సల్మాన్ ఖాన్ సినిమా రంజాన్ పండగ టైం లో రిలీజ్ అవ్వడం తో పే పెర్ వ్యూ పద్దతి అయినా 249 రేటు తో చూడటానికి ఫ్యాన్స్ అండ్ కామన్ ఆడియన్స్ జీ ప్లెక్స్ లో ఎగబడ్డారు. దాంతో లెక్కకు మిక్కిలి ట్రాఫిక్ రావడం తో…
దెబ్బకి జీ ప్లెక్స్ యాప్ క్రాష్ అయిపొయింది. దాంతో ఆన్ టైం లో సినిమా చూడాలి అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ కి ఇప్పుడు జీ ప్లెక్స్ వాళ్ళు ఇప్పుడు సినిమా ను ప్లే చేయలేక పోతున్నాం అంటూ కొద్ది సేపటి తర్వాత ట్రై చేయండి అంటూ మెసేజ్ లు పెడుతున్నారట. ఇంత పెద్ద నెట్ వర్క్ పెట్టుకుని…. ఈ మాత్రం ట్రాఫిక్ ని…
హ్యాండిల్ చేయక పొతే మీకు సినిమాలు అవసరమా అంటూ సోషల్ మీడియా లో అందరూ ఇప్పుడు జీ వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఈ రేంజ్ ట్రాఫిక్ ని ఎక్స్ పెర్ట్ చేసి ఉండరేమో కానీ అంత పెద్ద సంస్థ ఇంత పెద్ద సినిమా విషయం లో మరింత ప్రిపేర్ గా ఉండాల్సింది.