Home న్యూస్ 24 గంటల్లో తెలుగులో మైండ్ బ్లాంక్…కానీ 100Mతో ఎపిక్ రికార్డ్!!

24 గంటల్లో తెలుగులో మైండ్ బ్లాంక్…కానీ 100Mతో ఎపిక్ రికార్డ్!!

0

పాన్ ఇండియా సెన్సేషన్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ఆది పురుష్ సినిమా అఫీషియల్ టీసర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా ఈ టీసర్ లో గ్రాఫిక్స్ ఆడియన్స్ నుండి మైనస్ మార్కులు పడ్డాయి, ఫ్యాన్స్ కూడా డైజెస్ట్ చేసుకోలేని గ్రాఫిక్స్ ని జోడించిన టీసర్ కి మిశ్రమ స్పందన లభించినా కానీ యూట్యూబ్ లో ఈ టీసర్ ని ఎగబడి చూశారు అని చెప్పాలి ఇప్పుడు…

ముఖ్యంగా హిందీ లో ఈ టీసర్ కి వచ్చిన రెస్పాన్స్ బాలీవుడ్ హిస్టరీలోనే ఏ టీసర్ కి కూడా రాలేదు అంటే ఆ రేంజ్ లో ఈ టీసర్ అక్కడ రచ్చ చేసింది. కానీ అదే టైం లో తెలుగు లో మాత్రం ఈ టీసర్ అత్యంత తీవ్రంగా నిరాశ పరిచింది.

ప్రభాస్ ప్రీవియస్ మూవీ రాధే శ్యామ్ టీసర్ తో పోల్చితే సగంలో సగం కూడా అందుకోలేక పోయింది సింగిల్ చానెల్ లో…మొత్తం మీద యూట్యూబ్ రికార్డులు సింగిల్ ఛానల్స్ వే కౌంట్ చేస్తారు. ఒక చానెల్ లో 9.21 మిలియన్ వ్యూస్ ని 330K లైక్స్ ని అందుకోగా మరో ఛానెల్ లో 4.22 మిలియన్ వ్యూస్ ని 302K లైక్స్ ని అందుకుంది.

ఇక అన్ని భాషల్లో సినిమా సింగిల్ ఛానెల్స్ లో సాధించిన వ్యూస్ అండ్ లైక్స్ ని గమనిస్తే…
👉Telugu :- 9.21M – 330K Likes
👉Hindi :- 68.96M – 1.09M Likes
👉Tamil :- 8.07M – 56K Likes
👉Malayalam :- 5.99M – 34K Likes
👉Kannada :- 3.29M – 22K Likes
Total :- 95.52M – 1.53M Likes
ఇది అన్ని భాషల్లో సింగిల్ ఛానెల్స్ లో సినిమా టీసర్ సృష్టించిన ఓవరాల్ ఊచకోత….

మల్టిపుల్ ఛానెల్స్ వ్యూస్ అన్నీ కలిపితే ఏకంగా 100 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని ఆల్ మోస్ట్ 2 మిలియన్స్ కి దగ్గర అయ్యే రేంజ్ లో లైక్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. తెలుగు లో రాధే శ్యామ్ రేంజ్ లో వ్యూస్ దక్కి ఉంటే ఈ మార్జిన్ మరింత భారీగా ఉండి ఉండేది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సంక్రాంతికి ఏ రేంజ్ లో సందడి చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here