Home న్యూస్ 24 గంటలు ఓవర్….కుమ్మేసిన డాకు మహారాజ్ ట్రైలర్!!

24 గంటలు ఓవర్….కుమ్మేసిన డాకు మహారాజ్ ట్రైలర్!!

0

హాట్రిక్ విజయాలతో దూసుకు పోతున్న నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) సినిమా ఆడియన్స్ ముందుకు సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా..

ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుని కుమ్మేసింది ఈ ట్రైలర్….రెగ్యులర్ బాలయ్య మాస్ సీన్స్ అండ్ డైలాగ్స్ తో కాకుండా, డిఫెరెంట్ ఎక్స్ పీరియన్స్ ని ఇచ్చిన డాకు మహారాజ్ ట్రైలర్ సినిమా మీద డీసెంట్ అంచనాలను పెంచేసింది అని చెప్పాలి ఇప్పుడు.

సినిమా ఏమాత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరుని చూపించే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఇక సినిమా అఫీషియల్ ట్రైలర్ కి 24 గంటలు పూర్తి అయ్యే టైంకి మంచి రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పాలి ఇప్పుడు…

సీనియర్ హీరోల పరంగా మరీ రికార్డులు బ్రేక్ ఏమి అవ్వలేదు కానీ ఉన్నంతలో మంచి రెస్పాన్స్ నే ఈ టైలర్ సొంతం చేసుకుంది. 24 గంటల్లో వ్యూస్ పరంగా 7.98 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకుని బాలయ్య ప్రీవియస్ మూవీస్ రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది..

ఇక లైక్స్ పరంగా 195.5K లైక్స్ మార్క్ ని అందుకుని పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది….మొత్తం మీద సీనియర్ హీరోలలో మరోసారి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న డాకు మహారాజ్ సినిమా ట్రైలర్…

కామన్ ఆడియన్స్ లో కూడా సినిమా మీద మంచి క్యూరియాసిటీని పెరిగేలా చేసింది. బాలయ్య ప్రజెంట్ ఫామ్ దృశ్యా మినిమమ్ గ్యారెంటీ ఔట్ పుట్ వచ్చినా కూడా సంక్రాంతి కి మంచి లాంగ్ రన్ ను సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here