Home న్యూస్ 24 గంటలు ఓవర్….దేవర ట్రైలర్ కి షాకిచ్చే రెస్పాన్స్!

24 గంటలు ఓవర్….దేవర ట్రైలర్ కి షాకిచ్చే రెస్పాన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ నెల ఎండ్ లో ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో రిలీజ్ కి సిద్ధం అవుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) కొరటాల శివల కాంబోలో వస్తున్న సెన్సేషనల్ మూవీ దేవర(Devara Part 1) సినిమా మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా…

ఫ్యాన్స్ నుండి సినిమా ట్రైలర్ కి రెస్పాన్స్ ఎక్స్ లెంట్ గా ఉండగా సోషల్ మీడియాలో మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా ఆఫ్ లైన్ లో పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ సినిమా ట్రైలర్ కి సొంతం అయ్యింది అని చెప్పాలి. ఇక యూట్యూబ్ సినిమా ట్రైలర్ కి…

రికార్డుల జాతర ఖాయమని అందరూ అనుకున్నారు….ఆల్ మోస్ట్ సోలో హీరోగా ఎన్టీఆర్ నుండి 6 ఏళ్ల తర్వాత వచ్చిన సినిమా ట్రైలర్ అవ్వడంతో రికార్డుల వర్షం కురిపిస్తుంది అని అందరూ అనుకున్నా అలాంటిది ఏమి జరగలేదు…లైక్స్ పరంగా చూసుకుంటే…

ఫాస్టెస్ట్ లైక్స్ లో విషయంలో కానీ 24 గంటల రిపోర్ట్ ల పరంగా కానీ టాప్ 5 లో కూడా ఒకటిగా నిలవలేక పోయింది….ఇక వ్యూస్ పరంగా 24 గంటల్లో రీసెంట్ టైంలో స్టార్స్ నటించిన మూవీస్ లో వన్ ఆఫ్ ది లోవేస్ట్ అప్ డేటెడ్ వ్యూస్ ని సొంతం చేసుకుంది దేవర ట్రైలర్…

ఓవరాల్ గా 24 గంటలు పూర్తి అయ్యే టైంకి సినిమా ట్రైలర్ కి 10.38 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకోగా లైక్స్ పరంగా ఓవరాల్ గా 658.8K లైక్స్ మార్క్ ని అందుకుంది. లైక్స్ పరంగా ఓవరాల్ గా ఓకే కానీ వ్యూస్ పరంగా మాత్రం భారీ గా అండర్ పెర్ఫార్మ్ చేసింది ఈ ట్రైలర్…

ఓవరాల్ గా ట్రైలర్ రికార్డుల విషయంలో సినిమా అంచనాలను అందుకోలేక పోయినా కూడా ఆడియన్స్ లో ఓవరాల్ గా సినిమా మీద మంచి అంచనాలే ఉండటంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో ఉండే అవకాశం ఉండగా ఇక పాజిటివ్ రివ్యూలు వస్తే లాంగ్ రన్ లో కూడా మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here