Home న్యూస్ 24 గంటలు ఓవర్…హరిహర వీరమల్లు టీసర్ కి మైండ్ బ్లాంక్ రెస్పాన్స్!

24 గంటలు ఓవర్…హరిహర వీరమల్లు టీసర్ కి మైండ్ బ్లాంక్ రెస్పాన్స్!

0

అసలు ఉందా లేదా అనిపించే మూవీ నుండి వచ్చే అప్ డేట్స్ కి రెస్పాన్స్ అప్పుడప్పుడు ఇలానే ఉంటుందేమో…కానీ ఇది పవర్ స్టార్ మూవీ కదా ఏదైనా మ్యాజిక్ చేస్తుందేమో అని అనుకుంటే అలాంటిది ఏమి జరగలేదు….టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మూవీస్ లో హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu Movie) ఒకటి కాగా…

చాలా టైంగా షూటింగ్ లో ఉన్న ఈ సినిమా అసలు ఉంటుందో లేదో అన్న డౌట్స్ ఉండగా సడెన్ గా సినిమా నుండి అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేసిన టీం రీసెంట్ గా టీసర్ ను రిలీజ్ చేయగా టీసర్ క్వాలిటీ బాగానే మెప్పించగా పవన్ కళ్యాణ్ లుక్స్ అండ్ స్క్రీన్ ప్రజెన్స్ కూడా బాగానే ఆకట్టుకుంది….

డైరెక్టర్ మారిపోవడం, సినిమా డిలే అవ్వడం, ఎలాంటి అప్ డేట్ లేకుండా టీసర్ రిలీజ్ చేయడం లాంటివి సినిమా మీద ఆడియన్స్ లో ఎలాంటి బజ్ ఉందో అన్నది క్లియర్ చేయగా టీసర్ రిలీజ్ అయిన 24 గంటల్లో పూర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది….ప్రస్తుతం పొలిటికల్ హీట్ పెరిగిపోయిన టైంలో సినిమాల మీద ఆసక్తి తగ్గిన…

పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ టీసర్ ను సైతం పెద్దగా పట్టించుకోలేదు….దాంతో 24 గంటలు పూర్తి అయ్యే టైంకి ఈ టీసర్ కి వెరీ పూర్ రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పాలి. లైక్స్ పరంగా పర్వాలేదు అనిపించినా కూడా వ్యూస్ పరంగా మాత్రం భారీగానే నిరాశ పరిచింది. మొత్తం మీద 24 గంటలు పూర్తి అయ్యే టైంకి…

ఈ టీసర్ కి 3.14 మిలియన్స్ వ్యూస్ మాత్రమే సొంతం అవ్వగా లైక్స్ పరంగా 24 గంటల్లో 259.2K లైక్స్ ని అందుకుంది. లైక్స్ పర్వాలేదు కానీ వ్యూస్ మాత్రం చాలా తక్కువగా సొంతం చేసుకున్న టీసర్ ఆడియన్స్ ఆసక్తి ఎలా ఉందో చెప్పకనే చెప్పింది. టీసర్ 24 గంటల రెస్పాన్స్ సినిమా మీద ఆడియన్స్ లో రెస్పాన్స్ ఎలా ఉన్నది అనేది క్లియర్ చేస్తుంది…

రీసెంట్ టైంలో వచ్చిన పెద్ద సినిమాల టీసర్ లను బాగా ప్రమోట్ చేసుకుని మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుని సినిమా మీద బజ్ ను పెంచుకున్నారు…. కానీ హరిహర వీరమల్లు ఫస్ట్ నుండి ఉంటుందో ఉండదో అన్న డౌట్స్ నడుమ తెరకేక్కుతూ ఉండటంతో ఇప్పుడు టీసర్ కి ఇలాంటి రెస్పాన్స్ రావడం సహజమే…ఇక సినిమా ఈ ఇయర్ ఎండ్ లో వస్తుంది అంటున్నారు కాబట్టి సినిమా ఎలా ఉంటుందో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here