అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే సంక్రాంతికి భారీ లెవల్ లో రిలీజ్ అవ్వాల్సిన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర (Vishwambhara Teaser) సినిమా గేమ్ చేంజర్(Game Changer) కోసం రిలీజ్ ను సమ్మర్ కి పోస్ట్ పోన్ చేసుకోగా సినిమా అఫీషియల్ టీసర్ ను రీసెంట్ గా…
దసరా కానుకగా రిలీజ్ చేయగా ఫ్యాన్స్ ను బాగానే ఇంప్రెస్ చేసిన ఈ టీసర్ సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో ట్రోల్స్ కి కారణం అయింది, గ్రాఫిక్స్ వర్క్ బాలేదని, విజువల్స్ ఏమంత ఆకట్టుకోలేదని ఓ రేంజ్ లో ట్రోల్స్ ను సొంతం చేసుకుంది ఈ టీసర్…
ఇవన్నీ పక్కకు పెడితే టీసర్ కి రీచ్ పరంగా మాత్రం ఎక్స్ లెంట్ రీచ్ అయితే సొంతం అయ్యింది అని చెప్పాలి ఇప్పుడు..మొత్తం మీద 24 గంటల్లో టీసర్ కి టాలీవుడ్ లో సీనియర్ హీరోల పరంగా హైయెస్ట్ వ్యూస్ రికార్డ్ సొంతం అయ్యింది…అలాగే ఓవరాల్ గా ఆల్ టైం టాప్…
టీసర్ ల పరంగా కూడా విశ్వంభర టీసర్ కి ఆల్ టైం టాప్ 4 ప్లేస్ సొంతం అయ్యింది ఇప్పుడు…మొత్తం మీద 24 గంటల్లో ఈ టీసర్ కి యూట్యూబ్ లో 20.95 మిలియన్ వ్యూస్ సొంతం అవ్వగా లైక్స్ పరంగా 248.8K లైక్స్ సొంతం అయ్యాయి….
ఇది వరకు సీనియర్ హీరోల పరంగా మెగాస్టార్ నటించిన భోలా శంకర్ సినిమా టీసర్ 12.73 మిలియన్స్ తో రికార్డ్ కొట్టగా తన రికార్డును తానె ఇప్పుడు మెగాస్టార్ బ్రేక్ చేసి సంచలనం సృష్టించాడు. ఇక ఓవరాల్ గా లైక్స్ పరంగా పర్వాలేదు అనిపించే రేంజ్ లోనే రెస్పాన్స్ వచ్చినా…
వ్యూస్ పరంగా మాత్రం సీనియర్స్ లో రికార్డ్ ను అలాగే ఓవరాల్ గా ఆల్ టైం టాప్ 4 ప్లేస్ ను టీసర్ ల పరంగా సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా సినిమా మీద ఉన్న అంచనాలు కూడా పెరిగాయి. మేకర్స్ రిలీజ్ టైంకి గ్రాఫిక్స్ పై మరింత శ్రద్ధ తీసుకుంటే ఇక వచ్చే ఏడాది సమ్మర్ లో విశ్వంభర మాస్ భీభత్సం ఖాయమని చెప్పొచ్చు…