బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా కానుకగా భారీ ఎత్తున రిలీజ్ కి సిద్ధం అవుతున్న మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా ట్రైలర్ కి…
ఆడియన్స్ నుండి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పాలి. ట్రైలర్ క్వాలిటీ రవితేజ మాస్ రాంపేజ్ ట్రైలర్ లో హైలెట్ గా నిలిచాయి. ఇక ట్రైలర్ కి ఆడియన్స్ నుండి యునానిమస్ రెస్పాన్స్ సొంతం అవ్వగా ఓవరాల్ గా..
ట్రైలర్ కి 24 గంటలలో కూడా ఎక్స్ లెంట్ రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పాలి ఇప్పుడు. మొత్తం మీద 24 గంటలు పూర్తి అయ్యే టైం కి టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ కి 6.97 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకోగా లైక్స్ పరంగా ఈ ట్రైలర్ ఓవరాల్ గా…
177.4K లైక్స్ మార్క్ ని అందుకుని ఓవరాల్ గా సాలిడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమా అన్ని చోట్లా బిజినెస్ పరంగా కూడా కుమ్మేయగా ట్రైలర్ కి వచ్చిన సాలిడ్ రెస్పాన్స్ తో…
బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సినిమా సూపర్ సాలిడ్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది, ధమాకా తర్వాత రవితేజ చేసిన రావణాసుర సినిమా అంచనాలను అందుకోలేదు. ఇక ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ఏ రేంజ్ కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి.