బాక్స్ ఆఫీస్ దగ్గర 2024 సంక్రాంతి రిలీజ్ అయిన నాలుగు సినిమాలు పండగ సెలవుల్లో జోరు చూపిస్తూ ఉండగా ఇప్పుడు అన్ని సినిమాలు కనుమ హాలిడే రోజున ఎంటర్ అవ్వగా వేటి రేంజ్ లో అవి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజు రచ్చ చేస్తున్నాయి. అన్ని సినిమాల్లో సైంధవ్(Saindhav Movie) మాత్రం చాలా స్లోగా పెర్ఫార్మ్ చేస్తుంది… ఒకసారి అన్ని సినిమాల రిపోర్ట్ లను గమనిస్తే…
|హనుమాన్|Hanuman Day 5 Box Office Collections
కనుమ హాలిడే రోజున హనుమాన్ మూవీ రాంపేజ్ కొనసాగుతుంది… మొత్తం మీద ఎక్స్ ట్రా షోల కోసం ఇంకా ట్రై చేస్తూ ఉండగా ఈవినింగ్ షోలు కూడా ఎక్స్ లెంట్ గా ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో 5-5.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే ఈ కలెక్షన్స్ ఇంకా పెరగవచ్చు, ఇక వరల్డ్ వైడ్ గా 9-10 కోట్ల రేంజ్ లో షేర్ ని సినిమా అందుకునే అవకాశం ఉందని చెప్పాలి….
|గుంటూరు కారం|- Guntur Kaaram Day 5 Box Office Collections
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) గుంటూరు కారం సినిమా ఆంధ్రలో మంచి జోరు చూపిస్తుంది కానీ నైజాంలో మాత్రం డ్రాప్స్ ఉన్నాయి…ఉన్నంతలో మ్యాట్నీ షోల నుండి సినిమా జోరు చూపిస్తూ ఉండగా నైట్ షోలకు కూడా బుకింగ్స్ ట్రెండ్ సాలిడ్ గా ఉండగా సినిమా 5వ రోజు మొత్తం మీద అటూ ఇటూగా 7-8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది, ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది…
|సైంధవ్| Saindhav Day 4Box Office Collections
బాక్స్ ఆఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్(Venkatesh) సైంధవ్ మిగిలిన సినిమాలతో పోల్చితే చాలా వరకు స్లో డౌన్ అయింది…సినిమా జానర్ సంక్రాంతికి సెట్ అవ్వకపోవడం టాక్ కూడా మిక్సుడ్ గా ఉండటంతో పెద్దగా హోల్డ్ చూపించలేకపోతున్న సినిమా ఈ రోజు 1 కోటి రేంజ్ కి అటూ ఇటూగా వసూళ్ళని సొంతం చేసుకునే అవకాశం ఉంది..
|నా సామి రంగ| – Naa saami Ranga Day 3 Box Office Collections
బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్ నాగార్జున(Nagarjuna) నా సామి రంగ సినిమా అన్ని చోట్లా సాలిడ్ కలెక్షన్స్ తో జోరు చూపిస్తూ కనుమ హాలిడేని ఎంజాయ్ చేస్తుంది, సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు మరోసారి 3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే అంచనాలను మించిపోవచ్చు. సినిమా బ్రేక్ ఈవెన్ వైపు ఒక్కో అడుగు ముందుకేస్తుంది…
ఈ రోజుతో ఆల్ మోస్ట్ సంక్రాంతి సెలవులు కంప్లీట్ కానుండగా కొంచం ఫ్లో తర్వాత రోజుల్లో కూడా ఇంపాక్ట్ ఉంటుంది, ఉన్నంతలో మంచి టాక్ సొంతం చేసుకున్న సినిమాలు మిగిలిన రన్ లో జోరు చూపిస్తాయి. ఇక ఓవరాల్ గా అన్ని సినిమాలు అంచనాలకు తగ్గట్లు కలెక్షన్స్ ని ఎంతవరకు సొంతం చేసుకుంటాయో చూడాలి ఇప్పుడు.