బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్(Akshay Kumar) కెరీర్ లోనే ఎప్పుడూ లేని విధంగా వరుస పెట్టి ఫ్లాఫ్ మూవీస్ తో కెరీర్ లోనే ఆల్ టైం లోవేస్ట్ ఫేజ్ లో ఉన్నాడు…రీసెంట్ టైంలో చేసిన వరుస పెట్టి రిలీజ్ అయిన అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రమైన నిరాశను కలిగించాయి. ఇలాంటి టైంలో…
ఎట్టి పరిస్థితులలో కూడా కంబ్యాక్ సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్న టైంలో మరోసారి రీమేక్ నే నమ్ముకున్నాడు అక్షయ్ కుమార్….ఆ సినిమానే ఖేల్ ఖేల్ మే(Khel Khel Mein Movie)….ఈ సినిమా 2016 టైంలో ఇటాలియన్ భాషలో తెరకెక్కిన పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్ అనే సినిమా రీమేక్…
ఈ సినిమా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ను కూడా నమోదు చేసింది….అత్యధిక భాషల్లో రీమేక్ అయిన మూవీగా ఆల్ టైం రికార్డ్ ను సృష్టించిన ఈ సినిమా హిందీలో రీమేక్ అవ్వకన్నా ముందు ఓవరాల్ గా 26 భాషల్లో రూపొందిందట… ఇప్పుడు 27 భాషగా హిందీలో రీమేక్ అయ్యిందట…
ఇన్ని చోట్ల రీమేక్ అంటే సినిమా సబ్జెక్ట్ ఎంత పాపులరో అర్ధం చేసుకోవచ్చు…అలాంటి సబ్జెక్ట్ ను ఎంచుకున్న అక్షయ్ కుమార్ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆగస్టు 15న ఇండియాలో గ్రాండ్ గా రిలీజ్ అవుతూ ఉండగా ఈ సినిమాతో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర…
కంబ్యాక్ ని సొంతం చేసుకుంటానని నమ్మకంగా ఉండగా మొత్తం మీద భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిన ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ సాలిడ్ గానే జరగగా బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ 120 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు..
రీమేక్ అన్ని చోట్లా భారీ హిట్ గా ఏమి నిలవకపోయినా కూడా ఉన్నంతలో ఎక్కువ చోట్ల వర్కౌట్ అయిన ఖేల్ ఖేల్ మే హిందీలో ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, అక్షయ్ కుమార్ కి ఎంతవరకు కంబ్యాక్ గా నిలిచి హిట్ కొడుతుందో లేదో చూడాలి ఇప్పుడు.