నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీనుల లేటెస్ట్ సెన్సేషన్ అఖండ రికార్డుల రాంపేజ్ మొదలు పెట్టింది. సెకెండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ నుండి రిలీజ్ అవుతున్న మొదటి పెద్ద సినిమా అవ్వడంతో ఆడియన్స్ లో అటు ట్రేడ్ లో రచ్చ మరో లెవల్ లో ఉంది, ఇక సినిమా ఇంత మాస్ బొమ్మ అయినా కానీ ఓవర్సీస్ లో కూడా అద్బుతాలు సృష్టిస్తూ ఉండటం ఇప్పుడు విశేషంగా చెప్పుకోవాలి.
ఓవర్సీస్ లో రీసెంట్ టైం లో బాలయ్య-బోయపాటి మూవీస్ కి రెస్పాన్స్ అంతంత మాత్రమే ఉంటూ వచ్చింది, కానీ ఇప్పుడు అఖండ సినిమా విషయంలో క్రేజ్ మరో లెవల్ లో ఉండగా అక్కడ 500 కి పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంటున్న ఈ సినిమా…
బుకింగ్స్ ఆల్ రెడీ ఓపెన్ అవ్వగా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఓవరాల్ గా ఇప్పటి వరకు గ్రాస్ కలెక్షన్స్ లెక్క 200K మార్క్ ని అధిగమించి లేటెస్ట్ గా 275K మార్క్ ని టచ్ చేసింది. 2021 ఇయర్ లో ఇది టాలీవుడ్ తరుపున రికార్డ్ గా చెప్పుకోవాలి. ఈ ఇయర్ ఓవర్సీస్ లో పరిస్థితులు…
సరిగ్గా లేని టైం లో వకీల్ సాబ్ 120K ప్రీ సేల్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఇక పరిస్థితులు సెట్ అయిన తర్వాత లవ్ స్టొరీ సినిమా 140K మార్క్ ని అందుకోవడం విశేషం. కానీ ఈ రెండు సినిమాలతో పోల్చితే ఈ సినిమా పక్కా మాస్ మసాలా సినిమా… అయినా కానీ ఈ రేంజ్ క్రేజ్ ని సొంతం చేసుకోవడం విశేషం, సినిమా ఆల్ రెడీ…
బోయపాటి కెరీర్ లో ఓవర్సీస్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ అవ్వడానికి సిద్ధం అవుతుంది, ఇక బాలయ్య కెరీర్ లో రీసెంట్ టైం లో ఫ్లాఫ్స్ ఎఫెక్ట్ ఉన్నా ఈ రేంజ్ క్రేజ్ తో ఓపెన్ అవ్వడంతో కచ్చితంగా వీకెండ్ లోనే చాలా మొత్తాన్ని వెనక్కి తీసుకువచ్చే అవకాశం ఎంతైనా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా స్ట్రాంగ్ గానే సినిమా బుకింగ్స్ సాగుతున్నాయి.