Home న్యూస్ అఖండ ప్రీమియర్ షో రివ్యూ…ఇదేం మాస్ రా బాబు!

అఖండ ప్రీమియర్ షో రివ్యూ…ఇదేం మాస్ రా బాబు!

0

సెకెండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ నుండి ఆడియన్స్ ముందుకు వచ్చిన బిగ్ మూవీ అఖండ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 1550 కి పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుండగా ముందుగా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలను సినిమా కంప్లీట్ చేసుకుని ఫస్ట్ టాక్ ఏంటి అనేది బయటికి వచ్చేసింది, సింపుల్ గా కథ సింపుల్ గానే ఉన్నప్పటికీ సినిమా మొత్తం ఓ మాస్ జాతర అనిపించేలా ఉంది అనేది టాక్…

సినిమా స్టార్ట్ అవ్వడం విలేజ్ బ్యాగ్ డ్రాప్ తో స్టార్ట్ అయ్యి ఒక బాలయ్య చుట్టూ కథ ప్రజ్ఞా జైస్వాల్ ల లవ్ స్టొరీతో కొంచం సో సోగానే ఉన్నప్పటికీ యాక్షన్ సీన్స్ మాత్రం అదిరిపోయాయని అంటున్నారు. ఇక ప్ర్రీ ఇంటర్వెల్ నుండి అసలు రాంపేజ్ స్టార్ట్ అవుతుందని…

అప్పటి వరకు కొంచం సో సోగానే కథ ఉన్నప్పటికీ అఘోరా అయిన అఖండ ఎంట్రీ తో అల్టిమేట్ ఇంటర్వెల్ సీన్ పూనకాలు తెప్పిస్తుందని, సింహా… లెజెండ్ సినిమాల ఇంటర్వెల్ కి ఏమాత్రం తీసిపోని గట్టిగా చెప్పాలి అంటే మించిపోయే రేంజ్ లో ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుందని అంటున్నారు. ఇక సెకెండ్ ఆఫ్ నుండి రచ్చ….

మరో లెవల్ లో ఉంటుందని, ఆ రచ్చ ఎండ్ కార్డ్ వరకు వరుసగా యాక్షన్ సీన్స్ అండ్ ఎక్స్ లెంట్ ఎలివేషన్స్ తో మెస్మరైజ్ చేస్తుందని అంటున్నారు. ఇక శ్రీకాంత్ విలనిజం మెప్పించగా హీరోయిన్ జస్ట్ ఓకే అనిపించుకుందని, జగపతిబాబు స్పెషల్ రోల్ కూడా ఆకట్టుకోగా యాక్షన్ సీన్స్ కి తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్ లో మెప్పించగా….

జై బాలయ్య సాంగ్ కి థియేటర్ రెస్పాన్స్ అదిరిపోయిందని అంటున్నారు. ఇక అఖండ టైటిల్ సాంగ్ కూడా అల్టిమేట్ గా ఉండగా కథ ఒక్కటే కొంచం రొటీన్ గా ఉండటం లెంత్ కొంచం ఎక్కువ అయిన ఫీలింగ్ చిన్న చిన్న మైనస్ పాయింట్స్ అని…. సినిమా హిట్టు బొమ్మ అని అంటున్నారు. ఫైనల్ గా ప్రీమియర్స్ నుండి సినిమా హిట్ కి తగ్గని టాక్ వస్తుంది, ఇక ఇక్కడ టాక్ ఎలా ఉంటుంది అన్నది ఆసక్తి కరం అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here