వారం వారం రిలీజ్ అవుతున్న కొత్త సినిమాలు అన్నీ కూడా పెద్దగా ఇంపాక్ట్ ను ఏమి చూపించ లేక పోవడంతో, రిలీజ్ అయిన 4వ వారంలో వర్కింగ్ డేస్ లో స్టడీ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న శివ కార్తికేయన్(Siva Kartikeyan) సాయి పల్లవి(Sai Pallavi) ల కాంబోలో తెరకెక్కిన అమరన్(Amaran Movie) సినిమా…
నాలుగో వీక్ వర్కింగ్ డేస్ లో కూడా ప్రతీ రోజుకి కోటికి తగ్గకుండా గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుంటూ 27 రోజుల్లో ఇప్పుడు వరల్డ్ వైడ్ గా 319 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని కోలివుడ్ మీడియం రేంజ్ హీరోల్లో బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ తో దూసుకు పోతుంది..
సినిమా 27వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 16 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మరోసారి మంచి హోల్డ్ ని చూపించగా వరల్డ్ వైడ్ గా 1.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమా 70 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుని మరోసారి కుమ్మేసింది.
ఇక సినిమా 27 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Amaran Movie 27 Days Telugu States Collections (Inc GST)
👉Nizam: 11.65Cr~
👉Ceeded: 2.98Cr~
👉Andhra: 10.54Cr~
AP-TG Total:- 25.17CR(45.15Cr~ Gross)
5.50 కోట్ల టార్గెట్ మీద ఏకంగా 19.67 కోట్ల ప్రాఫిట్ తో ఎపిక్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఇక సినిమా 27 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Amaran Movie 27 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 154.90Cr
👉Telugu States – 45.15Cr
👉Karnataka – 22.70Cr
👉Kerala – 12.70Cr
👉ROI – 4.65Cr
👉Overseas – 78.75Cr***approx
Total WW collection – 318.85CR(155.90CR~ Share) Approx
మొత్తం మీద సినిమా 67 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 88.90 కోట్ల మమ్మోత్ ప్రాఫిట్ తో కోలివుడ్ మీడియం రేంజ్ హీరోలలో బిగ్గెస్ట్ ప్రాఫిట్ తో ఎపిక్ రికార్డ్ ను అందుకోగా లాంగ్ రన్ లో మరికొంత లాభాన్ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.