నాలుగు వారాలను ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Movie) 5వ వారంలో అడుగు పెట్టగా సినిమా ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లో సినిమా సాలిడ్ కలెక్షన్స్ నే అందుకుని నాలుగో వారం లో జోరు చూపించిన తర్వాత 5వ వీక్ లో…
బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త సినిమాల మధ్య మరోసారి సినిమా పర్వాలేదు అనిపించేలా హోల్డ్ ని చూపెడుతూ హోల్డ్ ని కొనసాగిస్తుంది సినిమా… ఓవరాల్ గా సినిమా కొత్త సినిమాలు రిలీజ్ అయినా కూడా దేవర మాస్ సెంటర్స్ లో హోల్డ్ కొనసాగుతూ ఉండగా…
ఓవరాల్ గా 28వ రోజుతో పోల్చితే 29వ రోజు తెలుగు రాష్ట్రాల్లో లిమిటెడ్ డ్రాప్స్ తోనే రన్ ను కొనసాగిస్తూ ఉండగా ఉన్నంతలో సినిమా ఈ రోజు ఇక్కడ 20 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే…
షేర్ మరికొంత పెరిగే అవకాశం ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల ఆవల సినిమా ఆల్ మోస్ట్ రన్ ఎండ్ స్టేజ్ కి వచ్చేసింది…ఉన్నంతలో సినిమా మరో లక్ష అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉంది. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి పర్వాలేదు అనిపిస్తూ…
హోల్డ్ ని కొనసాగిస్తూ ఉండగా మేజర్ గా మరోసారి తెలుగు రాష్ట్రాల నుండే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటున్న దేవర మూవీ వీకెండ్ లో కొద్ది వరకు గ్రోత్ ని చూపించే అవకాశం ఉంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 29 రోజుల్లో సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.