Home న్యూస్ భలే ఉన్నాడే 2 డేస్ కలెక్షన్స్…దెబ్బ మీద దెబ్బ…పాపం రాజ్ తరుణ్!

భలే ఉన్నాడే 2 డేస్ కలెక్షన్స్…దెబ్బ మీద దెబ్బ…పాపం రాజ్ తరుణ్!

0

కెరీర్ మొదలు పెట్టడం హాట్రిక్ విజయాలతో మొదలు పెట్టినా కూడా తర్వాత టైంలో సరైన సినిమాలు ఎంపిక విషయంలో పూర్తిగా వెనకబడిపోయిన హీరో రాజ్ తరుణ్(Raj Tarun) నటించిన రీసెంట్ మూవీస్ ఏవి కూడా ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించ లేక పోయాయి అలాగే మినిమమ్ మెప్పించ లేక పోయాయి…

బాక్ టు బాక్ రెండు సినిమాలతో రీసెంట్ గా వచ్చిన రాజ్ తరుణ్, కొంచం ప్రామిసింగ్ గా అనిపించిన భలే ఉన్నాడే(Bhale Unnade Box Office Collections) సినిమాతో ఆడియన్స్ ముందుకు రాగా ఈ సినిమా కూడా ఏమాత్రం ఆడియన్స్ ను మెప్పించ లేక పోయింది సినిమా…

సినిమాలో కొన్ని ఎంటర్ టైన్ మెంట్ సీన్స్ ఉండటంతో వీకెండ్ లో ఆక్యుపెన్సీ కొద్దిగా ఉంటుంది అనుకున్నా కూడా మత్తు వదలరా2 మూవీ ఆడియన్స్ ఫస్ట్ ఛాయిస్ గా మారి మిగిలిన సినిమాలు అన్నీ కూడా సైడ్ లైన్ అయిపోయాయి… ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ టికెట్ సేల్స్ ను కూడా..

సొంతం చేసుకోలేక పోయిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రోజుల్లో పట్టుమని 8 వేల టికెట్ సేల్స్ ను కూడా సొంతం చేసుకోలేక పోయింది. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో అతి కష్టం మీద 25-30 లక్షల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమే సొంతం చేసుకుంది.

ఒకప్పుడు హాట్రిక్ హిట్స్ కొట్టిన రాజ్ తరుణ్ కి రీసెంట్ టైంలో కాంట్రవర్సీలతో వార్తల్లో నిలిచినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించే విషయంలో వరుసగా విఫలం అవుతూనే ఉన్నాడు. ఇక ఈ సినిమా కూడా రాజ్ తరుణ్ కి మరోసారి నిరాశ పరిచే రిజల్ట్ నే ఇచ్చింది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here