టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మొదటి రోజు అంచనాలను మించి మాస్ రాంపెజ్ ను చూపించిన సినిమా రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కూడా సీడెడ్ లో ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించగా డే 2 ఇక్కడ టాప్ 2 రికార్డ్ ను నమోదు చేసి సంచలనం సృష్టించింది….
ఇక సినిమా నైజాంలో రీసెంట్ బిగ్ పాన్ ఇండియా మూవీస్ తో పోల్చితే పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేయగా ఓవరాల్ గా రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో 16-18 కోట్ల రేంజ్ లో షేర్ ని రాబట్టవచ్చు అనుకుంటే సినిమా 17.92 కోట్ల రేంజ్ లో షేర్ ని 26 కోట్లకు పైగా గ్రాస్ ను రెండో రోజున సొంతం చేసుకుని మంచి హోల్డ్ ని చూపించింది…
సినిమా మొదటి రోజు చేసిన రచ్చ కి రెండో రోజు 20 కోట్ల రేంజ్ దాకా షేర్ ని రాబట్టాలి కానీ నైజాంలో టికెట్ రేట్స్ తగ్గడం కొద్ది వరకు కలెక్షన్స్ పై ఇంపాక్ట్ చూపించింది. అయినా కూడా ఓవరాల్ గా మొదటి రోజు సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిన టాక్ దృశ్యా సినిమా బాగానే హోల్డ్ చేసింది రెండో రోజున…
ఇక టోటల్ గా 2 రోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే…
Devara Movie 2 Days Telugu States Collections report(Inc GST)
👉Nizam: 30.79Cr
👉Ceeded: 14.07CR
👉UA: 8.41Cr
👉East: 5.66Cr
👉West: 4.75Cr
👉Guntur: 8.20Cr
👉Krishna: 4.49Cr
👉Nellore: 3.20Cr
AP-TG Total:- 79.57CR (108.40CR~ Gross)
మొత్తం మీద చూసుకుంటే 2 రోజుల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకున్న సినిమా…టోటల్ గా తెలుగు రాష్ట్రాల బిజినెస్ 112.50 కోట్ల రేంజ్ లో జరగగా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 33 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే బిజినెస్ ను రికవరీ చేస్తుంది. ఇక సండే అడ్వాంటేజ్ తర్వాత అక్టోబర్ 2 హాలిడే తర్వాత దసరా సెలవుల అడ్వాంటేజ్ లు సినిమాకి మరింత హెల్ప్ చేయడం ఖాయమని చెప్పాలి ఇప్పుడు.