Home న్యూస్ హరోం హర 2 డేస్ టోటల్ కలెక్షన్స్….డే 2 ఇలా జరిగింది ఏంటి!!

హరోం హర 2 డేస్ టోటల్ కలెక్షన్స్….డే 2 ఇలా జరిగింది ఏంటి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సుదీర్ బాబు(Sudheer Babu) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ హరోం హర(Harom Hara) సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మాస్ అండ్ యాక్షన్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది కానీ తొలిరోజు కలెక్షన్స్ పరంగా మాత్రం సినిమా అనుకున్న రేంజ్ లో జోరు చూపించలేదు…

కానీ మౌత్ టాక్ బాగానే ఉండటంతో రెండో రోజు మంచి హోల్డ్ ని చూపిస్తుంది అనుకున్నా కూడా సినిమా గ్రోత్ ని చూపించలేదు కానీ డ్రాప్స్ ను సొంతం చేసుకుని అందరినీ ఆశ్యర్యపరిచింది. మొదటి రోజు 14.5 వేల టికెట్ సేల్స్ జరిగితే రెండో రోజుకి వచ్చే సరికి 12 వేలకు పైగానే టికెట్ సేల్స్ జరిగాయి… దాంతో పాటు ఆఫ్ లైన్ లో కూడా…

టికెట్ సేల్స్ లో డ్రాప్స్ రెండో రోజున కనిపించడం కలెక్షన్స్ పై ఇంపాక్ట్ చూపించగా రెండో రోజు మొత్తం మీద 54 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 64 లక్షల రేంజ్ లో షేర్ ని 1.30 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు. దాంతో ఓవరాల్ గా సినిమా రెండు రోజుల్లో…

టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
Harom Hara Movie 2 Days Total WW Collections
👉Nizam: 0.52CR~
👉Total AP: 0.72CR~
AP-TG Total:- 1.24CR(2.45Cr~ Gross)
👉KA+ROI+OS: 0.25Cr~
Total World Wide: 1.49CR(3.00CR~ Gross)

మొత్తం మీద సినిమా వాల్యూ టార్గెట్ 6.50 కోట్ల దాకా ఉండగా సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 5 కోట్ల రేంజ్ లో అయినా షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. టాక్ బాగానే ఉన్నా అనుకున్న రేంజ్ లో హోల్డ్ ని సినిమా చూపించకపోవడం ట్రేడ్ కి కూడా ఆశ్యర్యం కలిగిస్తుంది. ఇక 3వ రోజు సండే సినిమాకి చాలా కీలకం అని చెప్పాలి ఇప్పుడు.

Harom Hara 2 Days WW Collections Report!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here