Home న్యూస్ డే1 కి డబుల్….2వ రోజు మహారాజ వీరవిహారం..!!

డే1 కి డబుల్….2వ రోజు మహారాజ వీరవిహారం..!!

0

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi) కెరీర్ లో 50వ సినిమాగా రూపొందిన లేటెస్ట్ మూవీ మహారాజ(Maharaja Movie) సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ రివ్యూలు సొంతం అవ్వగా కలెక్షన్స్ పరంగా మొదటి రోజు దుమ్ము లేపిన ఈ సినిమా…

రెండో రోజు రెట్టించిన జోరు చూపించి ఆల్ మోస్ట్ ఇండియాలో 2 లక్షల రేంజ్ దాకా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాలలో సైతం సినిమా రెండో రోజు అంచనాలను అన్నీ కూడా మించి పోయి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపడం విశేషం అని చెప్పాలి…

మొదటి రోజు 60 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా రెండో రోజు ఆల్ మోస్ట్ డబుల్ గ్రోత్ ని చూపించి 1.10 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని కొత్త పాత సినిమాలను అన్నీ కూడా డామినేట్ చేసి సంచలనం సృష్టించడం విశేషం అని చెప్పాలి…. దాంతో ఓవరాల్ గా 2 రోజులు…

   

పూర్తి అయ్యే టైంకి తెలుగు లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Maharaja(Telugu) 2 Days Total Collections
👉Nizam: 0.85CR~
👉Total AP: 0.85CR~
AP-TG Total:- 1.70CR(3.40CR~ Gross)
ఇదీ మొత్తం మీద 2 రోజులలో తెలుగు లో సాధించిన కలెక్షన్స్…

తెలుగు లో సినిమా వాల్యూ టార్గెట్ 3.50 కోట్ల దాకా ఉండగా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో కాకుండా యింకా 1.80 కోట్ల షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక వరల్డ్ వైడ్ గా 2 రోజుల్లో 14.5-15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుందని అంచనా, ఓవర్సీస్ లెక్కలు ఇంకా రివీల్ అవ్వలేదు కాబట్టి వీకెండ్ తర్వాత క్లియర్ డాటా అప్ డేట్ అవుతుంది… ఓవరాల్ గా సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దూసుకు పోతుంది.

Maharaja(Telugu) 2 Days Collections...Excellent Day 2!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here