12 ఏళ్ల క్రితం బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న యూత్ స్టార్ నితిన్(Nithiin) కెరీర్ కి తిరిగి భారీ ఊపునిచ్చే బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న ఇష్క్(Ishq4K Re Release Collections) సినిమా 12.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అప్పట్లోనే సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 12 ఏళ్ల తర్వాత సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర..
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న వీకెండ్ లో ఆడియన్స్ ను కొద్ది వరకు థియేటర్స్ కి రప్పిస్తూ డీసెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండటం విశేషం. మొదటి రోజు ఆల్ మోస్ట్ 62 కి పైగా షోలు తెలుగు రాష్ట్రాల్లో హౌస్ ఫుల్ బోర్డులు పడగా…
మొదటి రోజు సినిమా 85 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా రెండో రోజు కూడా సినిమా మంచి జోరునే కొనసాగించింది. అడ్వాన్స్ బుకింగ్స్ అండ్ డే 1 కలిపి 18 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న సినిమా రెండో రోజు 5.5 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను…
సొంతం చేసుకుని మంచి హోల్డ్ ని చూపించింది. ఆఫ్ లైన్ లో కూడా డీసెంట్ ఆక్యుపెన్సీ లభించగా రెండో రోజు మొత్తం మీద సినిమా 16-18 లక్షల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని సొంతం చేసుకోగా ఓవరాల్ గా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా 2 రోజుల…
రీ రిలీజ్ లో 1 కోటి కి పైగా గ్రాస్ కలెక్షన్స్ తో రీ రిలీజ్ లో కూడా బాగానే సందడి చేసింది. అసలు పెద్దగా హైప్ ఏమి లేకుండా సైలెంట్ గా రీ రిలీజ్ అయినా కూడా ఓవరాల్ గా ఆడియన్స్ నుండి రెస్పాన్స్ సాలిడ్ గా సొంతం చేసుకుని రీ రిలీజ్ లో మంచి సక్సెస్ గా నిలిచింది ఇష్క్4K మూవీ.