Home న్యూస్ 2 డేస్ కల్కి టోటల్ కలెక్షన్స్….40+ అనుకుంటే…తుక్కుతుక్కుగా కొట్టిన రెబల్ స్టార్!

2 డేస్ కల్కి టోటల్ కలెక్షన్స్….40+ అనుకుంటే…తుక్కుతుక్కుగా కొట్టిన రెబల్ స్టార్!

0

మొదటి రోజు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను మించిన జోరుని చూపించి దుమ్ము దుమారం లేపింది. తెలుగు రాష్ట్రాలలోనే కాదు మిగిలిన అన్ని చోట్లా కూడా సినిమా అంచనాలను మించి పోయే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు…

సినిమా రెండో రోజు 40కోట్లకు పైగా షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకోవడం ఖాయం అనుకోగా తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని చోట్లా సినిమా అంచనాలను మించి పోయి ఏకంగా 50 కోట్ల షేర్ మార్క్ ని కూడా దాటేసి సంచలనం సృష్టించింది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో సినిమా 20 కోట్లకు పైగా షేర్ ని అందుకోగా హిందీలో ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపించి…

మొదటి రోజుకి మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఓవర్సీస్ లో సినిమా ఎక్స్ లెంట్ గా ట్రెండ్ ను చూపిస్తూ దూసుకు పోతూ ఉండగా రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 146 కోట్లకు పైగా షేర్ ని 280 కోట్ల లోపు గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా ఓవరాల్ గా 2 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Kalki 2898 AD 2 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 30.13Cr
👉Ceeded: 7.42CR
👉UA: 7.75Cr
👉East: 5.14Cr
👉West: 3.68Cr
👉Guntur: 4.38CR
👉Krishna: 4.03Cr
👉Nellore: 2.33Cr
AP-TG Total:- 64.86CR(101.55CR~ Gross)
👉KA: 9.20Cr
👉Tamilnadu: 4.20Cr
👉Kerala: 2.50Cr
👉Hindi+ROI: 25.20Cr
👉OS – 40.40Cr*****
Total WW Collections: 146.36CR(Gross- 279.60CR~)

ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 372 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఎక్స్ లెంట్ గా 2 రోజుల్లో దుమ్ము లేపగా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 225.64 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన 2 రోజుల వీకెండ్ లో సినిమా బాక్స్ అఫీస్ దగ్గర సాలిడ్ ట్రెండ్ ను ఇలానే కొనసాగించే అవకాశం ఎంతైనా ఉంది ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here