బాక్స్ ఆఫీస్ దగ్గర సిద్దార్థ్(Siddharth) నటించిన లేటెస్ట్ మూవీ టక్కర్(Takkar) సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి ఆడియన్స్ నుండి ఏమాత్రం అంచనాలను అందుకునే రేంజ్ లో అయితే టాక్ రాలేదు అని చెప్పాలి. దాంతో సినిమా ఓపెనింగ్స్ పరంగానే…
బిలో యావరేజ్ రేంజ్ ఓపెనింగ్స్ ని అందుకోగా రెండో రోజు కూడా సినిమా పెద్దగా జోరుని ఏమి చూపించలేక పోయింది అని చెప్పాలి ఇప్పుడు. సినిమా మొదటి రోజు తెలుగు లో అటూ ఇటూగా 75 లక్షల రేంజ్ లో గ్రాస్ ను 35 లక్షల రేంజ్ లో…
వర్త్ షేర్ ని సొంతం చేసుకోగా రెండో రోజుకి వచ్చే సరికి సినిమా 30% వరకు డ్రాప్ అయ్యి తెలుగు లో అటూ ఇటూగా 50 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. అందులో నుండి వర్త్ షేర్ 24 లక్షల దాకా ఉంటుందని అంచనా…
దాంతో టోటల్ గా సినిమా 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 60 లక్షల లోపు షేర్ ని 1.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా బ్రేక్ ఈవెన్ కోసం 2.5 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉండగా ఇంకా 1.90 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక రెండో రోజు తమిళనాడులో సినిమా…
1 కోటి లోపు గ్రాస్ ను అందుకోగా రెండో రోజు వరల్డ్ వైడ్ గా 2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుందని సమాచారం. టోటల్ గా 2 రోజుల్లో 4.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా అటూ ఇటూగా 12 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సి ఉంటుందట. అంటే 2 రోజుల్లో వర్త్ షేర్ 2 కోట్ల లోపు ఉంటుంది. ఈ లెక్కన సినిమా ఇంకా చాలా దూరం వెళ్ళాల్సిన అవసరం ఉంది.