Home న్యూస్ 375 కోట్ల హీరో షాహిద్…”తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా” టాక్ అండ్ 2...

375 కోట్ల హీరో షాహిద్…”తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా” టాక్ అండ్ 2 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాలీవుడ్ హీరోలలో కెరీర్ ని ఎప్పుడో మొదలు పెట్టినా కూడా సరైన బ్లాక్ బస్టర్ కోసం చాలా కాలం ఎదురు చూసిన హీరోలలో షాహిద్ కపూర్(Shahid Kapoor) ఒకరు, ఎట్టకేలకు 2019 టైంలో తెలుగు అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్(Kabir Sing) తో హిందీలో అల్టిమేట్ హిట్ ను సొంతం చేసుకున్నాడు షాహిద్… ఆ సినిమాతో తిరిగి తన క్రేజ్ భారీగా…

పెరిగి పోగా మరో రీమేక్ జెర్సీని అదే పేరుతో రీమేక్ చేసినా ఎక్కువ సార్లు పోస్ట్ పోన్ అవ్వడంతో ఆ సినిమా అంచనాలను అందుకోలేదు, తర్వాత చేసిన బ్లడీ డాడీ డిజిటల్ లో రిలీజ్ అవ్వగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు షాహిద్ నటించిన కొత్త సినిమా తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా(Teri Baaton Mein Aisa Uljha Jiya) సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది…

ఇందులో కృతి సనన్ ఆండ్రో హ్యూమనాయిడ్ రోబోగా నటించగా…ఒక రోబోకి మనిషికి లవ్ అయితే ఎలా ఉంటుంది తర్వాత ఏం జరిగింది అన్న కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా డీసెంట్ టైం పాస్ మూవీగా ఆడియన్స్ నుండి టాక్ ను సొంతం చేసుకుంది కలెక్షన్స్ మాత్రం మరీ అనుకున్న రేంజ్ లో అయితే సొంతం అవ్వడం లేదు…

375 కోట్ల కబీర్ సింగ్ తర్వాత షాహిద్ కి అనుకున్న రేంజ్ ఓపెనింగ్స్ దక్కలేదు, ఈ సినిమాకి ఫస్ట్ డే 7 కోట్లు, రెండో రోజు 10 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ సొంతం అవ్వగా వరల్డ్ వైడ్ గా 2 రోజుల్లో 34 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని మాత్రమె సొంతం చేసుకుంది ఈ సినిమా….

నార్మల్ రొమాంటిక్ మూవీ అవ్వడంతో మరీ ఎక్కువ కలెక్షన్స్ రావడం లేదు కానీ ఓవరాల్ గా వసూళ్లు స్టడీగానే ఉన్నా కూడా కబీర్ సింగ్ తో మరో లెవల్ కి వెళతాడు అనుకున్న షాహిద్ కపూర్ స్క్రిప్ట్ సెలెక్షన్ వలన తన మార్కెట్ కి డ్యామేజ్ చేసుకుంటున్నాడు అంటున్నారు… మరి తన అప్ కమింగ్ మూవీస్ తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here