బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మొదటి రోజు అనుకున్న అంచనాలను అన్నీ మించి పోయి రెండు బాక్ టు బాక్ డిసాస్టర్స్ తర్వాత సెన్సేషనల్ కంబ్యాక్ కొట్టిన యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా ఓవరాల్ గా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 14 కోట్ల లోపు గ్రాస్ ను అందుకోగా…
వరల్డ్ వైడ్ గా సినిమా 20.5 కోట్ల లోపు గ్రాస్ మార్క్ ని అందుకుని ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తో కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ని అందుకోగా…సినిమా ఇక రెండో రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించగా నైజాం, సీడెడ్ కోస్టల్ ఆంధ్ర అన్ని ఏరియాల్లో ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించింది…
ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తుంటే సినిమా 2వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 9-9.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ లెక్కలు బాగుంటే గ్రాస్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లు కలిపి సినిమా…
2.25-2.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా, వరల్డ్ వైడ్ గా రెండో రోజున సేఫ్ సైడ్ లో 11.5-12 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి, ఫైనల్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉండగా….మొత్తం మీద 2 రోజులు పూర్తి అయ్యే టైంకి…
తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా సినిమా 24 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 32-33 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఓవరాల్ గా ఫైనల్ లెక్కలను బట్టి సినిమా…
రెండో రోజున నాగ చైతన్య కెరీర్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ లేదా హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా సండే రోజున సినిమా మరింతగా జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది. ఇక టోటల్ గా సినిమా 2 రోజుల్లో సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.