బాక్స్ ఆఫీస్ దగ్గర యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ లైగర్ ను విజయ్ ఆల్ ఓవర్ ఇండియా రిలీజ్ కి ముందు నెల రోజుల టైం నుండి కూడా బాగా ప్రమోట్ చేసినా కానీ బాయికాట్ అంటూ గొడవలు మొదలు అవ్వడం, హీరో కామెంట్స్ కూడా ఆ బాయికాట్ గొడవలను మరింత పెంచడంతో కలెక్షన్స్ పై ఆ ఇంపాక్ట్ ఉంటుంది అని అందరూ అనుకున్నారు. దానికి తోడూ సినిమాకి….
భారీగా డిసాస్టర్ టాక్ ఆడియన్స్ నుండి లభించడంతో ఇక సినిమా తేరుకోలేక పోయింది. కానీ అదే టైం లో హిందీలో మాత్రం సినిమా ఇప్పుడు మంచి కలెక్షన్స్ తోనే పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి.
సినిమా ప్రీమియర్స్ ద్వారా అక్కడ 1.25 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా డే 1 కలెక్షన్స్ 4.50 కోట్ల మార్క్ ని అందుకుంది. దాంతో ప్రీమియర్స్ అండ్ డే 1 తో కలిపి 5.75 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకున్న ఈ సినిమా రెండో రోజుకి వచ్చే సరికి…
అక్కడ 4.25 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుని సాలిడ్ గా హోల్డ్ చేసింది. దాంతో 2 రోజుల్లో టోటల్ గా సినిమా 10 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుంది ఇప్పుడు. ఓవరాల్ గా సినిమా రివ్యూలు ఆడియన్స్ టాక్ దృశ్యా ఇవి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ అనే చెప్పాలి ఇప్పుడు…