బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడైనా హిట్ మూవీస్ కొట్టిన వాళ్ళకే ఎక్కువగా మార్కెట్ పెరుగుతూ ఉంటుంది, టాప్ హీరోలకు అంటే హిట్స్ కి ఫ్లాఫ్స్ కి అతీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కానీ మీడియం రేంజ్ హీరోల విషయం లో కానీ ఇతర హీరోల విషయం లో కానీ మార్కెట్ పెంచుకోవాలి అంటే బాక్స్ ఆఫీస్ హిట్స్ కంపల్సరీ గా ఉండాల్సిందే.. కెరీర్ ని ఎప్పుడో మొదలు పెట్టి హిట్స్ ని ఫ్లాఫ్స్ ని…
సమానంగా క్యారీ చేస్తున్న యూత్ స్టార్ నితిన్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర కంటిన్యూగా హిట్స్ తక్కువ సార్లే పడ్డాయి, ఒక హిట్ వస్తే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక ఫ్లాఫ్ పడటం కామన్ అవ్వగా వరుస ఫ్లాఫ్స్ తర్వాత లాస్ట్ ఇయర్ భీష్మ సినిమా తో కంబ్యాక్ కొట్టినా…
ఈ ఇయర్ బాక్ టు బాక్ రెండు ఫ్లాఫ్ మూవీస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు నితిన్. దాంతో ఆ ఇంపాక్ట్ నితిన్ కొత్త సినిమా మేస్ట్రో పై పడింది. ఈ సినిమాను ముందు థియేటర్స్ లో ఎలాగైనా రిలీజ్ చేయాలనీ భావించారు కానీ… థియేట్రికల్ బిజినెస్ రైట్స్…
వరుస ఫ్లాఫ్స్ ఎఫెక్ట్ వలన చాలా తక్కువ ఆఫర్స్ ఓవరాల్ గా వచ్చాయట… భీష్మ కి 21.8 కోట్ల బిజినెస్, చెక్ కి 16 కోట్ల బిజినెస్, రంగ్ దే కి 23.9 కోట్ల బిజినెస్ జరగగా ఈ సినిమా కూడా ఎక్స్ పెరిమెంటల్ మూవీ నే అవ్వడం తో బిజినెస్ ను 18 కోట్లకు టోటల్ రైట్స్ కి ఆఫర్ చేశారట, కానీ బడ్జెట్ ఎక్కువ అవ్వడం తో ఆ రేటు సెట్ అవ్వదు కాబట్టి…
డిజిటల్ ఆఫర్స్ కోసం ఎదురు చూడగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాళ్ళు ఏకంగా 34 కోట్లకు పైగా ఆఫర్ చేయడం తో డిజిటల్ రైట్స్ ని అమ్మేశారని టాలీవుడ్ లో స్ట్రాంగ్ బజ్ ఉంది, ఇది నిజం అయితే టీం కి జాక్ పాట్ తగిలినట్లు అనే చెప్పాలి. ఆల్ మోస్ట్ డబుల్ రేటు తో డిజిటల్ రైట్స్ సొంతం అవ్వడం విశేషం. ఇక సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.