Home గాసిప్స్ ఆస్తులు అమ్ముకునేలా చేసిన 2 సినిమాలు…లాస్ ఎన్ని కోట్లో తెలుసా!!

ఆస్తులు అమ్ముకునేలా చేసిన 2 సినిమాలు…లాస్ ఎన్ని కోట్లో తెలుసా!!

0

పరిమితులు దాటిన బడ్జెట్ లు ఎప్పుడూ ప్రమాదకరమే…అది స్టార్స్ నటించిన సినిమాలు అయినా మీడియం రేంజ్ మూవీస్ అయినా కూడా….బాక్స్ ఆఫీస్ దగ్గర రికవరీ అనుకున్న రేంజ్ లో లేకపోతె ఎంతో కొంత నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా జరగకుంటే ఇక ఆ నిర్మాత పరిస్థితి చాలా దారుణంగా ఉండటం ఖాయం. లేటెస్ట్ గా బాలీవుడ్ లో పేరున్న ఒక పెద్ద నిర్మాత పరిస్థితి ఇదే అయ్యింది…

ఎన్నో ఏళ్ళుగా బాలీవుడ్ లో ఎన్నో హిట్స్ అండ్ మంచి మూవీస్ నిర్మించిన నిర్మాణ సంస్థ అయిన పూజా ఎంటర్ టైన్ మెంట్ వాళ్ళు లాస్ట్ 2 ఏళ్లలో నిర్మించిన 2 అతి పెద్ద డిసాస్టర్ ల వలన ఇప్పుడు ఏకంగా ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని బాలీవుడ్ లో ఇప్పుడు స్ట్రాంగ్ గా వినిపిస్తున్న వార్తలు….

లాస్ట్ ఇయర్ టైగర్ ష్రాఫ్(Tiger Shroff) నటించిన గణపత్(Ganapath Movie) సినిమా అలాగే ఈ ఇయర్ అక్షయ్ కుమార్(Akshay Kumar) టైగర్ ష్రాఫ్(Tiger Shroff) ల కాంబినేషన్ లో వచ్చిన బడే మియా చోటే మియా(Bade Miyan Chote Miyan) సినిమాలకు ఊహకందని బడ్జెట్ పెట్టి నిర్మించగా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు సినిమాలు ఎపిక్ డిసాస్టర్లు అయ్యాయి…

1st వీక్ బాలీవుడ్ లో టాప్ కలెక్షన్స్ మూవీస్….2 సినిమాలతో SRK ఆల్ టైం రికార్డ్!!
గణపత్ మూవీ కి 170 కోట్లు ఖర్చు పెడితే బడే మియా చోటే మియా సినిమాకి 350 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే 2 సినిమాలకు కలిపి 520 కోట్ల ఖర్చు పెట్టి నిర్మించగా రెండుకి రెండు ఆల్ టైం ఎపిక్ డిసాస్టర్ లు అయ్యాయి. దాంతో నిర్మాతకి సైతం ఊహకందని రేంజ్ లో నష్టాలు రావడంతో, చేసేది ఏమి లేక….

7 అంతస్తుల తన ఆఫీసుని అమ్మాడట, అలాగే 80% వరకు తన స్టాఫ్ ను ఉద్యోగం నుండి తొలగించి ఆల్ మోస్ట్ 250 కోట్ల మేర నష్టాలను పూడ్చినట్లు బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి….అంతంత బడ్జెట్ పెట్టడం, ఆ సినిమాలు ఆడియన్స్ ను ఏమాత్రం మెప్పించక పోవడం నిర్మాతను ఆస్తులు అమ్ముకునే పరిస్థితికి తీసుకువచ్చింది ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here