నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు సెన్సేషనల్ కలెక్షన్స్ తో రచ్చ రచ్చ చేసింది. సినిమా మొదటి రోజు అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయి ఊహకందని కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు పోస్ట్ చేయడం అన్నది మామూలు మాస్ కాదనే చెప్పాలి. సినిమా ఓవరాల్ గా..
మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 15.39 కోట్ల షేర్ తో సంచలనం సృష్టించగా బాలయ్య కెరీర్ లో ఆల్ టైం రికార్డ్ ఓపెనర్ గా నిలిచింది. ఇందులో వర్త్ షేర్ ఆల్ మోస్ట్ 13 కోట్లకు పైగా ఉండటం విశేషం కాగా సినిమా ఇప్పుడు రెండో రోజులో అడుగు పెట్టగా తెలుగు రాష్ట్రాలలో…
ఓవరాల్ గా స్ట్రాంగ్ హోల్డ్ ని సొంతం చేసుకుంది అని చెప్పాలి. కానీ ఈ రోజు శుక్రవారం అవ్వడం వర్కింగ్ డే కూడా అవ్వడంతో మొదటి రోజు తో పోల్చితే రెండో రోజు డ్రాప్స్ ఆల్ మోస్ట్ 40% రేంజ్ లో కనిపిస్తున్నాయి అని చెప్పాలి. అందులో ఎక్కువ డ్రాప్స్…
నైజాం ఏరియాలో ఉండగా ఇక్కడ మొదటి రోజు కూడా ఆంద్రలో లాగా హెవీ ఫుల్స్ పడక పోయినా కానీ సాలిడ్ గా ఆక్యుపెన్సీ ని సొంతం చేసుకోవడం అనుకున్న రేంజ్ కి మించి వసూళ్ళని సొంతం చేసుకుంది. సినిమా ఇప్పుడు రెండో రోజు మార్నింగ్ మ్యాట్నీ షోల రిపోర్ట్స్ చూసిన తర్వాత ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ కూడా జోరు అందుకునేలా ఉండగా…
ఈ రోజు సినిమా మొదటి రోజుతో పోల్చితే 5-6 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల గ్రోత్ ని బట్టి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి ఈ లెక్క ఇంకా మించడమో లేక ఇదే రేంజ్ లో ఉండే అవకాశం ఉందని చెప్పొచ్చు. మరి మొత్తం మీద సినిమా రెండో రోజు డే ఎండ్ అయ్యే టైం కి ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.