యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సాహో బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఊహకందని లెవల్ లో కలెక్షన్స్ ని సాధించి దుమ్ము లేపింది, రెండు తెలుగు రాష్ట్రాలలో 36.52 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 73.6 కోట్లకు పైగా షేర్ ని అందుకోగా వీకెండ్ మొత్తం బుకింగ్స్ సాలిడ్ గా ఉండగా రెండో రోజు కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మతిరిగే కలెక్షన్స్ ని సాధిస్తుంది అని అంతా భావించారు.
సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ టికెట్స్ ఆన్ లైన్ టికెట్ సేల్స్ బాగుండటం తో రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 15 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించవచ్చు అని ప్రిడిక్ట్ చేశారు. కానీ రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 10.55 కోట్ల కలెక్షన్స్ తోనే సరిపెట్టుకుంది.
ఒక సారి రెండో రోజు ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…
Nizam – 5.21Cr
Ceeded – 1.66Cr
UA – 1.20Cr
East – 52L
West – 35L
Guntur – 66L
Krishna – 62L
Nellore – 33L
2nd day: 10.55Cr…. నైజాం ఏరియా తప్పితే మిగిలిన చోట్ల డ్రాప్స్ ఎక్కువగా ఉన్నాయి.
వాటికీ తోడు రెండో రోజు నైట్ షోలకు రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కొద్దిగా ఎదురుదెబ్బ కొట్టాయి. అవి కూడా ఇంపాక్ట్ చూపి ఉండొచ్చు. ఏది ఏమైనా కలెక్షన్స్ 15 కోట్ల మార్క్ ని అందుకోలేదు కానీ టాలీవుడ్ లో రెండో రోజు హైయెస్ట్ షేర్ ని అందుకున్న….
నాన్ బాహుబలి మూవీ గా సాహో రికార్డ్ సృష్టించింది. మిగిలిన ఏరియాల్లో ముఖ్యంగా సీడెడ్ అండర్ పెర్ఫార్మ్ చేయడం దెబ్బ కొట్టింది, లేకుంటే కచ్చితంగా రెండో రోజు కూడా సినిమా రికార్డుల వర్షం కురిపించి ఉండేది, సినిమా నైజాం లో రెండో రోజు బాహుబలి 2 సాధించిన 4.82 కోట్ల షేర్ ని బ్రేక్ చేసి సరికొత్త రికార్డ్ ను నమోదు చేసింది.