నితిన్ భీష్మ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊచకోత కోసేలా ఉంది, సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మహా శివరాత్రి అడ్వాంటేజ్ ను ఓ రేంజ్ లో వాడుకుని దుమ్ము దుమారం రేపిన విషయం తెలిసిందే, ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా అనుకున్న లెక్క ను కూడా మించే రేంజ్ వసూళ్ళ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ డే నే ఊచకోత కోసింది.
ఇక రెండో రోజు కి వచ్చే సరికి సినిమా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల నుండే జోరు ని చూపెడుతూ దూసుకు పోతుంది. సినిమా మొదటి రోజు మార్నింగ్ మ్యాట్నీ షోల లెవల్ కి ఓ 5% మాత్రమె డ్రాప్స్ ని సొంతం చేసుకుని 30% వరకు…
ఆక్యుపెన్సీ తో రన్ అవుతూ దుమ్ము లేపుతుంది, ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలలో మరీ మొదటి రోజు లెవల్ లో లేకున్నా కానీ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం సాలిడ్ గానే సాగుతుండటం తో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా జోరు రెండో రోజు కూడా కొనసాగడం ఖాయంగా కనిపిస్తుంది.
సినిమా రెండో రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల లెక్కలను బట్టి ఈవినింగ్ అండ్ నైట్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ లెక్కను కూడా పరిగణ లోకి తీసుకుంటే రెండో రోజు అవలీలగా 3 కోట్ల కి తగ్గని కలెక్షన్స్ ని మినిమమ్ అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. ఇక రోజు ముగిసే సరికి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి సినిమా…
ఎంతవరకు వెళుతుంది అన్నది క్లియర్ గా చెప్పగలం, ఓవరాల్ గా మొదటి రోజు తో పోల్చితే రెండో రోజు కూడా సినిమా సాలిడ్ గా హోల్డ్ చేయడం ఖాయమని చెప్పాలి, ఇక రోజు ముగిసే సరికి సినిమా బాక్స్ ఆఫీస్ స్టేటస్ ఏ విధంగా ఉందో చూసి అప్ డేట్ చేస్తాం…