విక్టరీ వెంకటేష్ నాగ చైతన్య ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ వెంకిమామ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపుతుంది, సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలో 7.05 కోట్ల షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 8.93 కోట్ల షేర్ ని అందుకుని సంచలనం సృష్టించింది, ఇక సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు…
30% లోపు డ్రాప్స్ ని సొంతం చేసుకున్నా తిరిగి ఈవినింగ్ అండ్ నైట్ షోలలో అల్టిమేట్ గ్రోత్ ని సాధిస్తూ దూసుకుపోతుంది, డ్రాప్స్ లో ఆల్ మోస్ట్ 15% టు 20% వరకు గ్రోత్ కనిపించగా రెండో రోజు కూడా ఇప్పుడు సినిమా సాలిడ్ కలెక్షన్స్ ని నమోదు చేయబోతుంది.
మార్నింగ్ అండ్ నూన్ షోల ఆక్యుపెన్సీ చూసి 3.5 కోట్ల షేర్ కన్ఫాం అనుకున్నా ఈవినింగ్ అండ్ నైట్ షోల ఆన్ లైన్ టికెట్ సేల్స్ జోరు చూసిన తర్వాత లెక్క ఇప్పుడు 4.2 కోట్ల నుండి 4.5 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు. ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కూడా.
అనుకున్న రేంజ్ లో ఉంటె ఈ లెక్క 4.5 కోట్ల నుండి 5 కోట్ల లోపు కూడా ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మొత్తం మీద ఇది ఊరమాస్ హోల్డ్ అనే చెప్పొచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా కూడా సినిమా ఇప్పుడు రెండో రోజు మొత్తం మీద 5 కోట్ల నుండి 5.5 కోట్ల రేంజ్ లో షేర్ ని..
అవలీలగా అందుకోవచ్చు. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు పూర్తిగా అనుకూలంగా ఉంటె ఈ రేంజ్ లో వెంకిమామ కుమ్ముడు ఖాయం అని చెప్పాలి లేకపోతె కొంచం తక్కువగా ఉంటుంది, ఏది ఏమైనా రెండో రోజు ఓవరాల్ గా చూసుకుంటే సాలిడ్ హోల్డ్ తో కలెక్షన్స్ ని అందుకుంది ఈ సినిమా. ఇక 2 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.