Home న్యూస్ వెంకిమామ డే 2 ఓపెనింగ్స్…కుమ్ముతున్నారుగా!!

వెంకిమామ డే 2 ఓపెనింగ్స్…కుమ్ముతున్నారుగా!!

1165
0

మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా సాలిడ్ ఓపెనింగ్స్ తో దుమ్ము లేపిన విక్టరీ వెంకటేష్ మరియి నాగ చైతన్య ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ వెంకి మామ బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 8.93 కోట్ల షేర్ తో దుమ్ము లేపింది, ఇక ఇప్పుడు రెండో రోజు సినిమా ఎంతవరకు హోల్డ్ చేస్తుంది ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుంది అన్నది ఆసక్తిగా మారగా…

సినిమా రెండో రోజు ని కూడా స్ట్రాంగ్ గానే మొదలు పెట్టింది, ఓవరాల్ గా చూసుకుంటే మొదటి రోజు తో పోల్చుకుంటే రెండో రోజు డ్రాప్స్ మార్నింగ్ అండ్ నూన్ షోలకు 30% లోపు ఉన్నాయి. ఇది సహజమే అని చెప్పాలి. కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోలకు బుకింగ్స్ జోరు అందుకుంటున్నాయి.

VenkyMama Total Pre Release Business

కొన్ని సెంటర్స్ లో మార్నింగ్ అండ్ నూన్ షోలు కుమ్మేశాయి. ఓవరాల్ గా మార్నింగ్ అండ్ నూన్ షోల కౌంట్ ని బట్టి చూస్తె రెండో రోజు అవలీలగా 3.5 కోట్ల లోపు షేర్ పక్కా అని చెప్పాలి. ఇక గ్రోత్ బాగుంది కాబట్టి ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్..

Venky Mama First Day Openings...Sensational ??

కూడా అనుకున్న రేంజ్ లో ఉంటె లెక్క మరింత పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఆ లెక్క 4.5 కోట్ల దాకా వెళ్ళే అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కల పై ఈ కలెక్షన్స్ ని కూడా మించడమా లేక దాని లోపే ఉండటమా అన్నది తేలనుంది.

Venky Mama First Day Collections Report!!

సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఫస్ట్ డే కలెక్షన్స్ కాకుండా మరో 25 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, అంటే రెండో రోజు మరియు మూడో రోజు సినిమా సాలిడ్ కలెక్షన్స్ ని ఎంత వీలయితే అంత సాధించాల్సి ఉంటుంది, ఇక రోజు ముగిసే సరికి సినిమా స్టేటస్ ఎలా ఉందో మరో ఆర్టికల్ లో అప్ డేట్ చేస్తాం.

Venky Mama 1st Day Worldwide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here