బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మొత్తం మీద 4.84 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న మాస్ మహారాజ్ నటించిన లేటెస్ట్ మూవీ ఖిలాడి సరైన ప్రమోషన్స్ లాంటివి బుకింగ్స్ లాంటివి లేట్ గా ఓపెన్ అయినా కానీ ఆఫ్ లైన్ లో రవితేజ పేరు మీద టికెట్ కౌంటర్స్ లో సాలిడ్ ఓపెనింగ్స్ నే సొంతం చేసుకుందని చెప్పాలి. కానీ క్రాక్ లాంటి ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తర్వాత….
ఈ రేంజ్ ఓపెనింగ్స్ సరిపోవు అనే చెప్పాలి. ఇక రెండో రోజులో అడుగు పెట్టిన ఖిలాడికి పోటిగా డిజే టిల్లు సినిమా నుండి పోటి ఎదురు అవ్వడం అలాగే ఖిలాడి కి మిక్సుడ్ టాక్ ఎఫెక్ట్ కూడా ఎఫెక్ట్ చూపడంతో రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర డ్రాప్స్….
కొంచం హెవీగానే ఉందని చెప్పాలి. నైజాంలో డ్రాప్స్ కొంచం ఎక్కువగా ఉండగా సినిమా ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం 50% ఆక్యుపెన్సీ అండ్ లో టికెట్ రేట్స్ హెల్ప్ తో బాగానే హోల్డ్ చేసింది కానీ ఓవరాల్ గా 30-35% డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఈవినింగ్ అండ్ నైట్ షోల టైం కి కొంచం….
గ్రోత్ ని సొంతం చేసుకున్నా కానీ సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే మొదటి రోజు లెవల్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉండగా ప్రస్తుతం ఉన్న డ్రాప్స్ వలన సినిమా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో 2 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది… అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా….
2.2 కోట్ల నుండి 2.4 కోట్ల రేంజ్ కి వెళ్ళే అవకాశం ఉంది కానీ బ్రేక్ ఈవెన్ కోసం సినిమా 3.5 కోట్ల రేంజ్ మినిమమ్ మెయిన్ టైన్ చేయాల్సి ఉంటుంది. మరి కంప్లీట్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అనుకున్న దానికన్నా మించి ఉండి సినిమా ఎంతవరకు కలెక్షన్స్ ని సినిమా రెండో రోజు సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక.