సంపూర్నేష్ బాబు హీరో గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కొబ్బరి మట్ట బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మొత్తం మీద 62 లక్షల దాకా షేర్ ని వసూల్ చేసి సత్తా చాటుకుంది, కాగా సినిమా రెండో రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు ఏమాత్రం తగ్గకుండా కలెక్షన్స్ ని సాధిస్తూ దూసుకు పోయింది, చాలా ఏరియాల్లో హౌస్ ఫుల్ బోర్డ్స్ పడగా కొన్ని సెంటర్స్ లో ఎక్స్ ట్రా థియేటర్స్ ని కూడా యాడ్ చేశారు.
అవి కూడా మంచి ఆక్యుపెన్సీ తో రన్ అవ్వగా మొత్తం మీద మొదటి రోజు లెవల్ లోనే రెండో రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా జోరు చూపింది, ఆన్ లైన్ టికెట్ సేల్స్ మొత్తం మొదటి రోజు లెవల్ లోనే ఉండటం తో సినిమా ఆఫ్ లైన్….
టికెట్ సేల్స్ కూడా అదే విధంగా ఉండే అవకాశం ఉండటం తో మొత్తం మీద సినిమా రెండో రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో మరో సారి 50 లక్షల నుండి 55 లక్షల వరకు షేర్ ని అందుకునే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్ గా సినిమా 60 లక్షల నుండి 65 లక్షల దాకా షేర్ ని…
సాధించే అవకాశం ఎక్కువగా ఉంది… ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు పూర్తిగా తెలియాల్సి ఉండగా ఈ లెక్క మరింత పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పాలి. మొత్తం మీద రెండు రోజుల వీకెండే అయినా కాని కొబ్బరి మట్ట అల్టిమేట్ అనిపించే విధంగా వీకెండ్ ని పూర్తీ చేసింది.
మొత్తం మీద వీకెండ్ కలెక్షన్స్ తో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లో సగానికి పైగా వెనక్కి తీసుకు వచ్చింది అని చెప్పాలి. ఇక సోమవారం నుండి సినిమా ఎంతవరకు హోల్డ్ చేస్తుంది అనే దాని పై లాంగ్ రన్ లో ఎంత దూరం వెళుతుందో చెప్పగలం… న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.