Home టోటల్ కలెక్షన్స్ 2 కోట్ల సినిమా…300 థియేటర్స్ లో రిలీజ్…వచ్చింది ఇది!!

2 కోట్ల సినిమా…300 థియేటర్స్ లో రిలీజ్…వచ్చింది ఇది!!

0

హృదయ కాలేయం సినిమా హిట్ తో వరుస పెట్టి అవకాశాలను సొంతం చేసుకున్న సంపూర్నేష్ బాబు అందులో ఒక్క కొబ్బరి మట్ట సినిమా తోనే మళ్ళీ పర్వాలేదు అనిపించుకున్నాడు బాక్స్ ఆఫీస్ దగ్గర… ఆ సినిమా తర్వాత మళ్ళీ వరుస ఆఫర్స్ రాగా అందులో ఆడియన్స్ ముందుకు హీరోగా నటించిన బజార్ రౌడీ సినిమా రీసెంట్ గా రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చిన మొదటి షో కే…

కంప్లీట్ నెగటివ్ రివ్యూ లను సొంతం చేసుకోగా ఏ దశలో కూడా ఆడియన్స్ ను మెప్పించలేక పోయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 300 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకున్నా కానీ మినిమం కలెక్షన్స్ ని కూడా సాధించలేక బాక్స్ ఆఫీస్ దగ్గర…

భారీ నిరాశని మిగిలించింది అని చెప్పాలి. సినిమా మొదటి 2 రోజుల్లో మొత్తం మీద 22 లక్షల గ్రాస్ ని 13 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకోగా తర్వాత టోటల్ రన్ లో మరో 16 లక్షల గ్రాస్ ని 9 లక్షల మేర షేర్ ని టోటల్ గా సాధించింది… దాంతో సినిమా టోటల్ రన్ లో..

బాక్స్ ఆఫీస్ దగగ్ర 38 లక్షల రేంజ్ లో గ్రాస్ ను 22 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్నట్లు అయింది. ఈ కలెక్షన్స్ లో కూడా డెఫిసిట్ లు అండ్ నెగటివ్ షేర్స్ ని తీయకుండా చెప్పిన కలెక్షన్స్ కాగా అవి కూడా తీసేస్తే మిగిలేది చిల్లర కలెక్షన్స్ అనే చెప్పాలి. సినిమాను మొత్తం మీద 2 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందించగా…

సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవ్వరూ కొనకపోవడం తో ఓన్ రిలీజ్ గా రిలీజ్ చేశారు… పబ్లిసిటీ కోసం కొంత ఖర్చు చేసినా ఆ ఖర్చులనే అతి కష్టం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర రికవరీ చేసిన సినిమా సంపూర్నేష్ బాబు కి మరో హిట్ అవుతుంది అనుకుంటే భారీ డిసాస్టర్ గా పరుగును ముగించింది అని చెప్పాలి. ఇక కంబ్యాక్ మూవీ ఏది అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here