బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ రావణాసుర సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రాగా సినిమా మొదటి రోజు అంచనాలను కొద్ది వరకు మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది, టాక్ కనుక పాజిటివ్ గా వచ్చి ఉంటే కచ్చితంగా కలెక్షన్స్ ఇంకా ఎక్కువగానే సొంతం చేసుకుని ఉండేది ఈ సినిమా. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజులో ఎంటర్ అయిన సినిమా…
తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద మొదటి రోజుతో పోల్చితే 40% రేంజ్ కి పైగానే డ్రాప్స్ ను సొంతం చేసుకోగా తిరిగి ఈవినింగ్ షోల టైం కి కొంచం బెటర్ గానే హోల్డ్ చేసింది. ఈ డ్రాప్స్ రెండో రోజు నార్మల్ అనే చెప్పాలి. నైజాంలో మరోసారి మంచి హోల్డ్ నే…
చూపించిన సినిమా మిగిలిన చోట్ల కూడా పర్వాలేదు అనిపించింది. ఇక మొత్తం మీద సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజు 2.4 కోట్ల నుండి 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పాలి. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ కలెక్షన్స్ ఇంకొంచం…
పెరిగే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 3 కోట్ల లోపు షేర్ ని అందుకునే అవకాశం ఉంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పైనే ఎక్కువగా డిపెండ్ అయిన సినిమా మొదటి రోజులా మరోసారి అంచనాలను మించి కలెక్ట్ చేస్తుందో లేదో చూడాలి ఇప్పుడు.