Home న్యూస్ డౌట్ కొట్టింది కానీ…తన పవర్ ఏంటో చూపించిన రవితేజ!!

డౌట్ కొట్టింది కానీ…తన పవర్ ఏంటో చూపించిన రవితేజ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఆఫ్ లైన్ కౌంటర్ దగ్గర స్ట్రాంగ్ టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగలిగే హీరోల్లో మాస్ మహారాజ్ రవితేజ ఒకరు, తన రీసెంట్ మూవీస్ లో దుమ్ము లేపిన క్రాక్ కానీ ధమాకా కానీ కూడా తొలిరోజు బుకింగ్స్ అంతంత మాత్రమే ఉన్నా కూడా ఆఫ్ లైన్ లో కౌంటర్ టికెట్ సేల్స్ ఎక్స్ లెంట్ గా ఉండటంతో ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా అంచనాలను మించిపోయాయి…

ఇక ఇప్పుడు బ్లాక్ బస్టర్ ధమాకా తర్వాత వచ్చినా కూడా అనుకున్న రేంజ్ లో బజ్ ను సొంతం చేసుకోలేక పోయిన రవితేజ లేటెస్ట్ మూవీ రావణాసుర మొదటి రోజు ముందు బుకింగ్స్ మరోసారి నిరాశ పరిచినా కానీ కౌంటర్ దగ్గర టికెట్ సేల్స్ విషయంలో మరోసారి రవితేజ మాస్ పవర్ ని చూపిస్తూ…

ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఒకసారి రీసెంట్ టైం లో రవితేజ నటించిన సినిమాల మొదటి రోజు కలెక్షన్స్ ని గమనిస్తే….
👉#Ravanasura – 4.29CR*****
👉#DHAMAKA – 4.66CR
👉#RamaraoOnDuty – 2.82Cr
👉#Khiladi – 4.30cr
👉#krack – 6.25Cr
👉#DiscoRaja – 2.54Cr
👉#AmarAkbarAnthony – 3.40Cr~

రావణాసుర సినిమాకి టాక్ కూడా మిక్సుడ్ గా వచ్చింది, దాంతో నైట్ షోలు కొంచం డ్రాప్ అయ్యాయి, అలా జరగకుండా ఉండి ఉంటే కచ్చితంగా క్రాక్ తర్వాత సెకెండ్ బెస్ట్ హైయెస్ట్ ఓపెనింగ్ మూవీ గా నిలిచి ఉండేది. ఇక ఓపెనింగ్స్ వరకు తన మాస్ పవర్ ని చూపించిన రవితేజ లాంగ్ రన్ లో ఎంతవరకు కలెక్ట్ చేయగలుగుతాడో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here