Home న్యూస్ సాహో డే 2 కలెక్షన్స్….180 కోట్ల భీభత్సం ఇది!!

సాహో డే 2 కలెక్షన్స్….180 కోట్ల భీభత్సం ఇది!!

0

     బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అంచనాలకు మించి కలెక్షన్స్ ని సాధించిన సాహో సినిమా తమిళ్ అండ్ మలయాళం వర్షన్స్ తప్పిస్తే మిగిలిన అన్ని చోట్లా కూడా సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంది, తెలుగు రాష్ట్రాలలో సీడెడ్ లో మాత్రం కొంచం అండర్ పెర్ఫార్మన్స్ చేసింది ఈ సినిమా. ఇక రెండో రోజు విషయానికి వస్తే మొదటి వీకెండ్ బుకింగ్స్ దాదాపు అన్ని చోట్లా ఎక్కువగా బుక్ అవ్వడం సినిమా కలిసి వచ్చింది.

దాంతో టాక్ విషయాన్నీ పక్కకు పెడితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ సాలిడ్ గా ఉన్నాయి, సీడెడ్ అలాగే కొన్ని మాస్ సెంటర్స్ డ్రాప్స్ గట్టిగానే కనిపించినా క్లాస్ సెంటర్స్ అండ్ మల్టీప్లేక్సులలో మాత్రం సినిమా జోరు కొనసాగింది. దాంతో రెండో రోజు ఇప్పుడు సినిమా…

15 కోట్ల నుండి 17 కోట్ల మధ్యలో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి లెక్క క్లియర్ గా తేలుతుంది, ఇక హిందీ లో సినిమా రెండో రోజు ఈవినింగ్ అండ్ నైట్ షోలలో గ్రోత్ సాధించడం తో ఇప్పుడు 20 కోట్ల నుండి 22 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకునే చాన్స్ ఉంది.

కర్ణాటక లో 2.5 కోట్ల షేర్ ని ఈ రోజు సాధించే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో ఈ రోజు సాధించే కలెక్షన్స్ తో 2 మిలియన్ ని క్రాస్ చేయోచ్చు. కానీ తమిళ్ అండ్ మలయాళం హ్యాండ్ ఇవ్వడం తో ఈ రోజు రెండు చోట్లా కలిపి 3 కోట్ల రేంజ్ గ్రాస్ వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద…

మొదటి రోజు తో పోల్చితే రెండో రోజు 30 కోట్ల నుండి 35 కోట్ల మధ్యలో షేర్ ని 60 కోట్లకు పైగా గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకోవచ్చు. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి లెక్కలో మార్పులు ఉండే అవకాశం ఉంది, ఓవరాల్ గా 2 రోజుల కలెక్షన్స్ 180 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకునే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here