యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఆర్ ఆర్ ఆర్ ఈ ఇయర్ టాలీవుడ్ అండ్ ఇండియాస్ సెకెండ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలవగా తెలుగు లో రీసెంట్ గా ఫస్ట్ టైం టెలికాస్ట్ అవ్వగా టి.ఆర్.పి రేటింగ్ ల పరంగా కొత్త రికార్డులు నమోదు చేస్తుంది అనుకున్నా కానీ అలాంటిది ఏమి జరగలేదు.
మొత్తం మీద డీసెంట్ అనిపించేలా 19.62 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుని పర్వాలేదు అనిపించినా ఈ రేంజ్ మమ్మోత్ మల్టీ స్టారర్ నుండి ఇంకా ఎక్కువ రేటింగ్ నే అందరూ ఎక్స్ పెర్ట్ చేశారు అని చెప్పాలి.
ఇక రీసెంట్ గా సినిమా సెకెండ్ టైం కూడా టెలికాస్ట్ అవ్వగా అప్పుడైనా బెటర్ గా హోల్డ్ చేసి మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంటుంది అనుకుంటే మొత్తం మీద 8.01 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుని మరోసారి జస్ట్ ఓకే అనిపించుకుంది.
ఆల్ రెడీ జనాలు చాలా సార్లు థియేటర్స్ లో అలాగే డిజిటల్ లో చూసి చూసి ఉండటం ఇలా కొంచం తక్కువ రేటింగ్స్ రావడానికి ఒక కారణం అయి ఉండొచ్చు అని చెప్పాలి. కానీ బాక్స్ అఫీస్ దగ్గర, డిజిటల్ లో తర్వాత గ్లోబల్ లెవల్ లో అద్బుతాలు సృష్టిస్తున్న సినిమా నుండి ఇంకొంచం ఎక్కువే ఆశించడంలో తప్పు లేదు కానీ రేటింగ్స్ జస్ట్ ఓకే అనిపించేలా వస్తున్నాయి.