బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ రివ్యూలను సొంతం చేసుకోగా ఆంధ్రలో లో టికెట్ రేట్స్ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా మొదటి వారం దుమ్ము లేపే కలెక్షన్స్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుంది కానీ రెండో వారానికి వచ్చే సరికి మాత్రం రెగ్యులర్ ఆడియన్స్ అనుకున్న రేంజ్ లో…
థియేటర్స్ కి రాక పోవడం అలాగే అన్ సీజన్ ఎఫెక్ట్ కూడా ఉండటం వలన కలెక్షన్స్ చాలా తగ్గిపోయాయి…. అవి ఏ రేంజ్ లో తగ్గాయి అంటే ఏకంగా లాస్ట్ ఇయర్ సెకెండ్ వేవ్ పీక్ టైం లో ఆంధ్రలో టికెట్ రేట్స్ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా….
వకీల్ సాబ్ సాధించిన కలెక్షన్స్ కన్నా తక్కువగా ఉండటం కొంచం విచారకరం అనే చెప్పాలి. మొత్తం మీద పాండమిక్ తర్వాత ఆడియన్స్ ముందుకు వచ్చిన బిగ్ బడ్జెట్ మూవీస్ లో వకీల్ సాబ్ సినిమా రెండో వారం లో మొత్తం మీద 5.98 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా…. తర్వాత సెకెండ్ వేవ్ తర్వాత…
రిలీజ్ అయిన బిగ్ మూవీ అఖండ రెండో వారంలో 9.82 కోట్ల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది. ఇక తర్వాత వచ్చిన పుష్ప సినిమా మిక్సుడ్ టాక్ ఉన్నా కానీ క్రిస్టమస్ అండ్ న్యూ ఇయర్ అడ్వాంటేజ్ వలన ఏకంగా 11.66 కోట్ల రేంజ్ షేర్ ని సొంతం చేసుకుంది రెండో వీక్ లో… ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్…
భీమ్లా నాయక్ సినిమా కి అన్ సీజన్ ఎఫెక్ట్ అలాగే, రెగ్యులర్ ఆడియన్స్ కూడా అనుకున్న రేంజ్ లో రాకపోవడం తో సినిమా రెండో వారం లో సినిమా 4.62 కోట్ల షేర్ తోనే సరిపెట్టుకుంది… లాస్ట్ ఇయర్ తో పోల్చితే ఇప్పుడు పరిస్థితులు బాగున్నా కానీ వకీల్ సాబ్ కన్నా కూడా బెటర్ గా ఉంటుంది అనుకుంటే సినిమా రెండో వారంలో భారీగా డ్రాప్ అయ్యి కొంచం నిరాశ పరిచింది అనే చెప్పాలి.